ఎమ్మెల్యే అరెస్ట్‌, మా జగన్‌ నన్ను అరెస్ట్‌ చేయించారు  

Kotam Reddy Sridhar Reddy Comments On Jagan Mohan Reddy - Telugu Ap Cm Jagan Mohan Reddy, Kotam Reddy Sridhar Reddy, , Ycp Mla Kotam Reddy

ఎంపీడీఓ సరళ పెట్టిన కేసులో భాగంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిని పోలీసులు నేడు ఉదయం అరెస్ట్‌ చేశారు.తెలుగు దేశం పార్టీ నాయకుల నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయాల్సిందిగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి డీజీపీని ఆదేశించారు.

Kotam Reddy Sridhar Reddy Comments On Jagan Mohan Reddy

ఎమ్మెల్యే అరెస్ట్‌తో తాము పక్షపాతంగా వ్యవహరించడం లేదని చెప్పేందుకు జగన్‌ ప్రయత్నించారు.కేసులో అరెస్ట్‌ అయిన కొద్ది సమయంకే ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యారు.

విడుదలయ్యాక ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ నన్ను అరెస్ట్‌ చేయించారని పేర్కొన్నాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ.

చట్టానికి ఎవరు అతీతులు కారు అని చెప్పేందుకు జగన్‌ గారు నన్ను అరెస్ట్‌ చేయించారు.అయితే కేసు విషయంలో నేను క్లీన్‌ చీట్‌తో బయటకు వస్తాననే నమ్మకం నాకు ఉంది.

జిల్లా ఎస్పీకి నాకు ఎన్నికల ముందు నుండే విభేదాలు ఉన్నాయి.ఎన్నికల సమయంలో కూడా నాకు ఇబ్బంది కలిగించాడు.

ఇప్పుడు ఆదేశాలు వచ్చిన వెంటనే అరెస్ట్‌ చేసేందుకు హడావుడి చేశాడు.ఒక శాసనసభ్యుడిని అనే విషయాన్ని కూడా మర్చిన ఆయన నన్ను అరెస్ట్‌ చేసేందుకు చాలా హంగామా చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ కేసును తాను న్యాయ స్థానంలో ఎదుర్కొంటానంటూ ప్రకటించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు