ఆ హీరో చూడటానికి అమితాబ్ లా ఉంటాడు.. కోట కామెంట్స్ వైరల్!

ప్రస్తుత కాలంలో బ్యాగ్రౌండ్ లేకుండా నటుడిగా ఎదగడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే రవితేజ మాత్రం ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.

 Kota Srinivasarao Shocking Comments About Hero Amitabh Goes Viral, Mirapakay, Sh-TeluguStop.com

కెరీర్ తొలినాళ్లలో రవితేజ చిన్నచిన్న పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.ఆ పాత్రలతోనే నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రవితేజ లో బడ్జెట్ సినిమాలలో నటించి స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

మాస్ రోల్స్ లో, కామెడీ రోల్స్ లో అద్భుతంగా నటించే టాలెంట్ రవితేజ సొంతమనే సంగతి తెలిసిందే.

కోట శ్రీనివాసరావు రవితేజ గురించి మాట్లాడుతూ ఇడియట్ సినిమాకు ముందు రవితేజతో నేను ఏడెనిమిది సినిమాలలో కలిసి చేశానని తెలిపారు.

రవితేజకు టిపికల్ స్టైల్ ఉంటుందని కోట తెలిపారు.నటనలో మంచి ఈజ్ ఉన్న యాక్టర్ రవితేజ అని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.తన వెటకార ధోరణిని రవితేజ సినిమాసినిమాకు మార్చుకుంటాడని కోట శ్రీనివాసరావు తెలిపారు.మొనాటనీ రాకుండా రవితేజ కెరీర్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన షాక్, మిరపకాయ్ సినిమాలలో తాను నటించానని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.రవితేజలో ఫ్రాంక్ నెస్ బాగా నచ్చిందని ఆయన వెల్లడించారు.

రవితేజ పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని రవితేజ సెట్ కళకళలాడుతూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ విషయాలను నేను రవితేజలో అబ్జర్వ్ చేశానని ఆయన వెల్లడించారు.

Telugu Amitabh, Raviteja, Mirapakay, Shock-Movie

రవితేజ పెద్దలను ఎంతగానో గౌరవిస్తాడని ఆయన పేర్కొన్నారు.రవితేజకు అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టమని నేను అమితాబ్ తో కలిసి సినిమా చేశానని తెలిసి బాబాయ్.మంచి మార్కులు సంపాదించుకున్నావ్ అని అమితాబ్ గారితో చేశావ్ అని అన్నాడని కోట తెలిపారు.ఒక యాంగిల్ లో రవితేజ అమితాబ్ లా ఉంటారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube