విష్ణుకు మద్దతు తెలిపిన కోట.. ప్రకాష్ రాజ్ కు క్రమశిక్షణ లేదంటూ!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియషన్ మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి.రోజురోజుకూ హీట్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

 Kota Srinivasa Rao Sensational Comments On Prakash Raj Details, Kota Srinivasa R-TeluguStop.com

మరొక రెండు రోజుల్లో మా ఎలెక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరింత వేడి వాతావరణం కనిపిస్తుంది.ఎప్పుడు సాదాసీదాగా జరిగే మా ఎన్నికలు ఈసారి వాద ప్రతివాదనలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు.

మా అధ్యక్షా పదవికి చాలా మంది పోటీ పడాలని బరిలోకి దిగారు.కానీ సమయం దగ్గర పడుతుండడంతో ఒక్కొక్కరుగా డ్రాప్ అవుతూ చివరకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు.

ఇప్పుడు వీరిద్దరి మధ్య రసవత్తరంగా మారింది.నువ్వంటే నువ్వు అంటూ ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నారు.

ఈ ఎన్నికలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాదు పొలిటికల్ గా కూడా హాట్ గా చర్చలు సాగుతున్నాయి.

అధ్యక్షా పదవికి పోటీ చేసే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మద్దతు దారులు కూడా పొలిటికల్ ఎలెక్షన్స్ రేంజ్ లో ఒకరిపై మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి మరి దూషించు కుంటున్నారు.

Telugu Kotasrinivasa, Maa, Manchu Vishnu, Prakash Raj, Sensational, Tollywood-Mo

మంచు మనోజ్ కు బాలకృష్ణ, కృష్ణ, కృష్ణం రాజు మద్దతు తెలుపగా ప్రకాష్ రాజ్ కు మాత్రం మెగా కుటుంబం మద్దతు తెలిపింది.తాజాగా మంచు విష్ణు కు సపోర్ట్ గా కోట శ్రీనివాస రావు కూడా రంగం లోకి దిగారు.

Telugu Kotasrinivasa, Maa, Manchu Vishnu, Prakash Raj, Sensational, Tollywood-Mo

ఈయన మంచు విష్ణు కు మద్దతు తెలుపుతూనే ప్రకాష్ రాజ్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.తాను ప్రకాష్ రాజు తో కలిసి 15 సినిమాల్లో నటించానని ఐతే ఏ రోజు కూడా ప్రకాష్ రాజ్ సమయానికి షూటింగ్ కు రాలేదని అసలు ప్రకాష్ రాజ్ కు క్రమశిక్షణ లేదంటూ కోట శ్రీనివాస రావు విమర్శలు చేసారు.మంచు విష్ణుకు నేను మద్దతు ఇస్తున్నాని తెలిపారు.ఆయనకు మా అధ్యక్షుడు అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని కోట చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube