బాబు మోహన్ ని నిజంగానే తన్నిన కోట శ్రీనివాసరావు.. ఆతర్వాత ఏం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా,విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు కోట శ్రీనివాసరావు గారు ఒకరు.కోట శ్రీనివాసరావు ఏదైనా పాత్ర చేస్తున్నాడంటే ఆ పాత్రలో జీవించేస్తాడన్న సత్యం మనందరికీ తెలిసిందే.

 Kota Srinivasa Rao Kicked Babu Mohanbabu Mohan, Kota Srinivasa Rao, Tollywood, K-TeluguStop.com

ఈక్రమంలోనే కోట శ్రీనివాస్ రావు బాబు మోహన్ కి మధ్య సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా హాస్యాస్పదంగా ఉంటాయి.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి నటించిన మామగారు సినిమాలో బాబు మోహన్ ఒక బిక్షగాడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి కోట చేత తన్నులు తినేవాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాస రావు బాబు మోహన్ కు తనకు మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనలు ఈ సందర్భంగా తెలియజేశారు.చిన్న రాయుడు సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి దగ్గర రామచంద్రాపురంలో ఒకరోజు షూటింగ్‌ జరుగుతోంది.

అయితే ఆ రోజు బాబు మోహన్ మీద ఉన్న సీన్లు అన్ని పూర్తి చేసి ఆ రోజు సాయంత్రం తిరుపతికి వెళ్లాల్సి ఉంది.ఈ క్రమంలోనే చిత్రబృందం తనని కోపరేట్ చేయమని చెప్పారు.

చిన్న రాయుడు సినిమాలో బాబు మోహన్ నిత్యం తనని ఏదో ఒక ప్రశ్నలడుగుతూ విసిగిస్తూ తన చేత తన్నులు తినేవాడు.

Telugu Babu Mohan, China Rayudu, Kicked, Tollywood-Movie

ఈ క్రమంలోనే బాబు మోహన్ వెళ్లాల్సి ఉండడంతో మధ్యాహ్నం భోజనం చేయకుండా ఎంతో నిర్విరామంగా షూటింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. డైరెక్టర్ గారు యాక్షన్ అనగానే నేను వేలు పైకెత్తి ఆ కొబ్బరి చెట్టుకు ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయని బాబు మోహన్ ని అడగాలి.ఆ సమయంలో బాబు మోహన్ 1,2 అని లెక్క పెడుతుండగా తనని తన్నే సన్నివేశం ఉంది.

అలా తన్నే సమయంలో పొరపాటున నా కాలు అతనికి తగలడంతో ఒకేసారి బాబు మోహన్ 50 అడుగుల దూరం వెళ్ళాడు.అక్కడ అందరూ అది సన్నివేశంలో భాగం అనుకుంటున్నారు కానీ నిజం నాకు ఒక్కడికే తెలుసు అతనికి ఏమయిందో అని ఎంతో కంగారు పడ్డాను.

ఈ క్రమంలోనే బాబు మోహన్ లేచి టేక్ ఓకేనా అనడంతో డైరెక్టర్ ఓకే అన్నారు.ఎదురుగా నేను వెళ్లి సారీ బ్రదర్ అనుకోకుండా జరిగింది అనడంతో మనం చేస్తున్నది నటన.ఆ సన్నివేశం బాగా రావాలంటే కొన్ని సార్లు ఇలాంటివి తప్పదు అంటూ మాట్లాడారని ఈ సందర్భంగా అప్పుడు జరిగిన ఈ సంఘటనను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కోట తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube