తిండికి లేక చస్తుంటే మా బిల్డింగ్ అవసరమా.. కోట శ్రీనివాసరావు కామెంట్స్ వైరల్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రకాష్ రాజ్, విష్ణు పోటీ చేస్తుండగా ఎన్నికల రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.తాజాగా కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Kota Sreenivasarao Shocking Comments About Movie Artist Association Building, Ko-TeluguStop.com

సునీల్ ఒక సినిమాలో డైలాగ్స్ బాగా చెబితే అతను పెద్ద యాక్టర్ అవుతాడని తాను చెప్పానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.మనిషి అన్న తర్వాత పుకార్లు వస్తుంటాయని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఒకరోజు పద్మనాభం గారు రైలులో కలిశారని తాను ఆ సమయంలో సెకండ్ క్లాస్ లో కూర్చుని ఉన్నానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.ఆయన సెకండ్ క్లాస్ లో కూర్చోవడం గురించి అడిగితే ఏసీ పడదని చెప్పారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

మనం చేసే చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మొత్తం 900 మంది ఉన్నారని ఎలక్షన్ లో పాల్గొనే వాళ్లు 400 మంది ఉంటారని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Telugu Manchu Vishnu, Artist, Praksah Raj, Sunil, Tollywood-Movie

నాకు ఇష్టమైతే ఓటు వేసుకోవచ్చని లేదంటే లేదని కోట శ్రీనివాసరావు తెలిపారు.విష్ణు సొంత డబ్బులతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టించడం గురించి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ సొంత డబ్బులు ఎవరికి లేవని ప్రశ్నించారు.బిల్డింగ్ కట్టిస్తే నేను వెళ్లి ఉంటానా? అని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు నెలకు వారం రోజులు షూటింగ్ జరిగేలా చూడాలని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Telugu Manchu Vishnu, Artist, Praksah Raj, Sunil, Tollywood-Movie

లక్ష రూపాయలు కట్టి మెంబర్ గా చేరినవాళ్లకు ఏం ఇస్తున్నామని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.లక్ష రూపాయలు కట్టి మెంబర్ గా చేరిన వాళ్లకు అవసరమైనది బిల్డింగా? తిండికి లేక చేస్తున్నారని వాళ్లకు అవకాశాలు ఇప్పిస్తే బాగుంటుందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.కోట శ్రీనివాసరావు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube