ఆ నటుడికి ఓటు వేసి తప్పు చేశాను.. కోట కామెంట్స్ వైరల్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్ సంచలన ఆరోపణలు చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు విష్ణుకు సపోర్ట్ చేశారు.

 Kota Sreenivasarao Shocking Comments About Hero Srikanth, Kota Sreenivasarao ,-TeluguStop.com

అయితే విష్ణుకు మద్దతు ఇచ్చిన కోట శ్రీనివాసరావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను విష్ణుకు మద్దతు ఇవ్వడం నిజమేనని అయితే విష్ణుకు మద్దతు ఇచ్చినంత మాత్రాన విష్ణు ప్యానల్ సభ్యులందరికీ తాను ఓట్లు వేసినట్టు కాదని కోట శ్రీనివాసరావు తెలిపారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన శ్రీకాంత్ కు తాను మద్దతు ఇచ్చానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసిన శ్రీకాంత్ కు తాను ఓటు వేసి గెలిపించానని కోట శ్రీనివాసరావు అన్నారు.

అయితే ప్రకాష్ రాజ్ పైనల్ నుంచి ఎవరైతే విజయం సాధించారో వాళ్లంతా రాజీనామా చేశారని శ్రీకాంత్ కు ఓటు వేసి తప్పు చేశానని తనకు అనిపిస్తోందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Telugu Srikanth, Maa, Manchu Vishnu, Praksah Raj, Tollywood-Movie

రిజైన్ చేసేవాళ్లకు ఓటు వేసి అనవసరంగా తన ఓటును వృథా చేసుకున్నానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.తాము పోటీ చేసే పైనల్లో  గెలవని పక్షంలో పదవికి రిజైన్ చేస్తామని ఎవరూ చెప్పలేదని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.ఆ విషయాన్ని ముందుగానే ప్రకటించి ఉంటే తన ఓటును మరో వ్యక్తికి వేసి ఉండేవాడినని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

పదవికి రిజైన్ చేసేవాళ్లు పోటీలో నిలబడటమే వేస్ట్ అని కోట శ్రీనివాసరావు అన్నారు.

Telugu Srikanth, Maa, Manchu Vishnu, Praksah Raj, Tollywood-Movie

కోట శ్రీనివాసరావు చెప్పింది కరెక్ట్ అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.ఈ మధ్య కాలంలో మీడియా ఇంటర్వ్యూలలో తన మనస్సులోని మాటలను వ్యక్తపరుస్తూ కోట శ్రీనివాసరావు వార్తల్లో నిలుస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube