మూవీ ఆఫర్ కోసం పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశా : కోట శ్రీనివాసరావు

వందల సినిమాల్లో విలన్ రోల్స్ లో, కామెడీ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపును సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు.ఎలాంటి పాత్రకైనా నూటికి నూరు శాతం న్యాయం చేసే కోట శ్రీనివాసరావు కొన్నేళ్ల క్రితం వరకు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ఈ మధ్య కాలంలో కోట శ్రీనివాసరావుకు ఆఫర్లు తగ్గాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కోట శ్రీనివాసరావు మూవీ ఆఫర్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

 Kota Sreenivasarao Interesting Comments About Movie Offers-TeluguStop.com

లాక్ డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితం కావడంతో బోరింగ్ గా అనిపించిందని కోట శ్రీనివాసరావు చెప్పారు.సినిమా ఆఫర్ల కోసం హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పాటు డైరెక్టర్లు వీవీ వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు ఫోన్ చేశానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దక్కిందని పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించానని కోట శ్రీనివాసరావు అన్నారు.

 Kota Sreenivasarao Interesting Comments About Movie Offers-మూవీ ఆఫర్ కోసం పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశా : కోట శ్రీనివాసరావు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆఫర్లు వస్తే మరిన్ని సినిమాల్లో నటించడానికి తాను సిద్ధమేనని కోట శ్రీనివాసరావు అన్నారు.మరి కోట శ్రీనివాసరావుకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తారేమో చూడాల్సి ఉంది.ఏడు పదుల వయస్సులో కూడా సినిమాలపై ఇష్టంతో కోట శ్రీనివాసరావు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

ఈ మధ్య కాలంలో జులాయి, గబ్బర్ సింగ్, రాధ సినిమాలు నటుడిగా కోట శ్రీనివాసరావుకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

ప్రాణం ఖరీదు సినిమాతో 42 సంవత్సరాల క్రితం వెండితెరకు పరిచయమైన కోట శ్రీనివాసరావు ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త నటులు వచ్చినా ఇప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.

కోట శ్రీనివాసరావు పలు సందర్భాల్లో ఇతర రాష్ట్రాల నటులకు బదులుగా ప్రతిభ ఉన్న తెలుగు నటులకు అవకాశాలు ఇవ్వాలని దర్శకనిర్మాతలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

#Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు