మెగా ఫ్యామిలీలో చిరంజీవి లేకపోతే ఏమీ లేదు.. కోట కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, విష్ణులలో విష్ణుకు మద్దతు ప్రకటించారనే సంగతి తెలిసిందే.తాజాగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తొందరపడి మాట్లాడుతున్నారని తాను గతంలోనే చెప్పానని కోట శ్రీనివాసరావు అన్నారు.

 Kota Sreenivasarao Interesting Comments About Megastar Chiranjeevi Details, Int-TeluguStop.com

ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తులంతా తనకు తెలుసని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అయితే ప్రకాష్ రాజ్ మాత్రం షూటింగ్ సమయంలో సమయపాలనను పాటించేవారు కాదని కోట శ్రీనివాసరావు అన్నారు.

నిర్మాతలకు కూడా ఈ విషయం తెలుసని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.ఇప్పటివరకు జరిగిన ఏ కార్యవర్గ సమావేశంకు ప్రకాష్ రాజ్ హాజరు కాలేదని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి టీవీలలో వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని ఈ ఎన్నికలలో ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోరని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Telugu Maa, Manchu Vishnu, Artist, Nagababu, Prakash Raj, Tollywood-Movie

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రకాష్ రాజ్ రెండుసార్లు సస్పెన్షన్ కు గురయ్యాడని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.ప్రకాష్ రాజ్ ఏ అర్హతతో అధ్యక్షుడి పదవికి పోటీ చేస్తున్నాడని కోట శ్రీనివాసరావు ప్రశ్నించారు.

Telugu Maa, Manchu Vishnu, Artist, Nagababu, Prakash Raj, Tollywood-Movie

ప్రకాష్ రాజ్ తో తాను ఎప్పుడూ అగౌరవంగా మాట్లాడలేదని ప్రకాష్ రాజ్ ఎంట్రీ తర్వాతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఘర్షణ వాతావరణం నెలకొందని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.చిరంజీవి లేకపోతే మెగా కుటుంబంలో ఏమీ లేదని చిరంజీవికి తన కుటుంబం నుంచి ఎవరినైనా నిలబెట్టాలని సూచించానని అయితే మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ ఇవ్వడం తనకు నచ్చలేదని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube