నాగార్జున కొట్టిన తర్వాత తల ఊపుతూ ఉన్నాను.. కోటా కామెంట్స్ వైరల్!

టాలెంట్ ఉన్న సీనియర్ నటులలో కోట శ్రీనివాసరావు ఒకరనే సంగతి తెలిసిందే.తన సినీ కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించి విజయాలను అందుకున్న కోట శ్రీనివాసరావు వయస్సు పెరుగుతున్నా సినిమాల్లో మాత్రం నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

 Kota Sreenivasarao Interesting Comments About Hero Nagarjuna-TeluguStop.com

కోట శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శత్రువు సినిమా తర్వాత తనకు రక్షణ సినిమాతో అదే స్థాయిలో గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.

రక్షణ సినిమాకు ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

 Kota Sreenivasarao Interesting Comments About Hero Nagarjuna-నాగార్జున కొట్టిన తర్వాత తల ఊపుతూ ఉన్నాను.. కోటా కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రక్షణ సినిమాలో రోజా, శోభన హీరోయిన్లుగా నటించారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.ఈ సినిమా షూటింగ్ సమయానికి తాను ఫ్యామిలీ మెంబర్స్ తో మద్రాస్ లోనే ఉన్నానని సినిమాలో తను రాజకీయ నాయకునిగా నటించానని కోట శ్రీనివాసరావు తెలిపారు.

ఆ సినిమా కోసం తాను వెరైటీ విగ్గు ధరించానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.ఆ సినిమాలో తాను పొలిటీషియన్ అయినప్పటికీ తల ఊపుతూ కనిపిస్తానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

సినిమాలో ఒక సీన్ లో నాగార్జున నన్ను కొడతాడని నాగార్జున కొట్టిన తర్వాత కూడా తల ఊపుతూ ఉండటంతో ఆయన పకపకా నవ్వారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.ఆ తర్వాత తాను బాగా చేస్తున్నానని నాగార్జున ప్రశంసించారని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Telugu Hero Nagarjuna, Interesting Comments, Kota Sreenivasarao, Rakshana Movie, Shatruvu-Movie

చెంపదెబ్బ తిన్న తర్వాత తల ఊపడం తేలిక కాదని కానీ మీరు అలానే ఊపుతున్నారని నాగార్జున అన్నారని కోట శ్రీనివాసరావు చెప్పారు.ఆ సినిమాలోని పాత్రను అద్భుతంగా పోషించానని తన నటనకు ప్రశంసలు దక్కాయని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.కోట శ్రీనివాసరావు పాత్రల వల్లే సక్సెస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.వయస్సుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కోట శ్రీనివాసరావు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

#Nagarjuna #Shatruvu #Rakshana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు