అమ్మవారి విగ్రహం పాలు తాగుతోంది అంటూ...     2018-10-20   21:13:21  IST  Sai Mallula

అమ్మవారి విగ్రహం పాలు తాగుతోంది అంటూ … హడావుడి చేయడంతో ఆ వార్త వైరల్ గా మారి ఆ ఆలయం వద్ద తనోపతండాలుగా జనాలు గుమగుడిపోయారు. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రం శంషాబాద్‌లోని కోటమైసమ్మ ఆలయంలోని విగ్రహం పాలు తాగుతుందని భక్తులంతా ఆ దేవాలయానికి చేరుకొని చెంచాలతో పాలు తాగించారు. అయితే కొందరు తొలుత అమ్మవారి విగ్రహం నోటి వద్ద స్పూన్‌లో పాలు పోసి ఉంచగా ఆ పాలు క్రమక్రమంగా తగ్గిపోయాయి. ఈ విషయం తెలిసిన భక్తులు ఆలయం వద్దకు చేరుకొని పాలు తాగించేందుకు పోటీపడ్డారు. నవరాత్రి ఉత్సవాలు ముగించుకున్న భక్తులు ఆ దేవాలయానికి చేరుకొని నైవేద్యంగా ఆవు పాలను సమర్పించారు.

Kota Mysamma Statue Is Drinking Milk At Shamshabad-

Kota Mysamma Statue Is Drinking Milk At Shamshabad

ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దేవాలయం వద్దకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కాగా దసరా పండుగ కావడంతో ఆ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఆలయం లోపలి నుంచి గజ్జెల చప్పుడు వచ్చేదని ఆ బస్తీకి చెందిన భక్తులు తెలిపారు. ఈ దేవాలయంలో కోటమైసమ్మతల్లి స్వయంభుగా వెసినందున నవరాత్రులప్పుడు మాతా తప్పకుండా దేవాలయంలోకి వస్తుందని భక్తుల నమ్మకం.