పేరుతో పాటు కష్టాలు.. కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

Kota About His Fame And Struggles

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.విలన్ రోల్స్ ప్లే చేయడంలో తనదైన స్టైల్ క్రియేట్ చేసిన కోట.

 Kota About His Fame And Struggles-TeluguStop.com

ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు.కోట తెరమీద కనబడితే చాలు ప్రేక్షకులు ఆయన చూస్తుండాల్సిందే అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు.

డైలాగ్ డెలివరీ కాని బాడీ లాంగ్వేజ్ కాని గెటప్ కాని అన్నిటినీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేయగల సత్తా ఉన్న నటుడు కోట.ఆయన జీవిత విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోట.

 Kota About His Fame And Struggles-పేరుతో పాటు కష్టాలు.. కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా తన జీవితం గురించి పలు కామెంట్స్ చేశారు.

తెలుగు సినిమాలలో నటుడిగా తాను రాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు కోట.

తన వరకు తాను బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉండాలనుకున్నానని, ఒకవేళ తాను సినిమాల్లోకి వస్తే ‘ముఖం అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా?’ అని ఎవరైనా అంటారేమోనని భయపడేవాడినని చెప్పాడు.అయితే, తాను నాటకాలు వేసే వాడినని, ఇరవై ఏళ్ల పాటు నాటకాలు వేసిన తనకు నాటకరంగంలో మంచి పేరుందని వివరించాడు.

అప్పట్లోనే తను కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లోనే జంధ్యాల తెలుసన్నాడు.అలా తాను జంధ్యాల సినిమాల్లో వేషాలు వేసేవాడినని, అలా వెళ్లొచ్చేవాడినని అన్నాడు.

అయితే, ఒకానొక దశలో ఆర్టిస్టుగా తాను చాలా బిజీ అయిపోయానని తెలిపాడు.రోజుకు ఇరవై గంటలు పని చేయడంతో పాటు మూడు రాష్ట్రాలు పయనించి షూటింగ్స్‌లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నాడు.

Telugu Actor Kota Ssrinivasa Ravu, Bank Job, Jandhyala, Kota Son Died, Kota Srinivasa Rao, Kota Srinivasa Rao Family, Kotasrinivaa Rao Life Struggles, Tollywood, Villain Roles-Movie

ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదాలను షేర్ చేసుకున్నాడు.తనకు గొప్ప పేరుతో పాటు కష్టాలు కూడా వచ్చాయని సంచలన కామెంట్స్ చేశారు కోట.తన భార్య డెలివరీ తర్వాత అనగా 1973లో తన అత్తగారు చనిపోయారని, ఆ షాక్‌లో తన భార్య మతిస్థిమితం కోల్పోయిందని కోట తెలిపారు.ఇక తన రెండో కూతురు యాక్సిడెంట్‌లో ఒక కాలును కోల్పోగా చాలా బాధపడ్డానని, తన అబ్బాయి యాక్సిడెంట్‌లో ప్రాణం కోల్పోయాడని చెప్పుకొచ్చాడు.

ఇన్ని బాధలు ఉన్నప్పటికీ తను కెరీర్‌లో ముందుకు సాగుతున్నానని, భగవంతుడు తనకు పేరుతో పాటు కష్టాలు ఇచ్చాడని, వాటిని తట్టుకునే గుండెను కూడా ఇచ్చాడేమోనని కోట పేర్కొన్నారు.

#Kota #KotaSrinivasa #KotaSsrinivasa #Jandhyala #Villain Roles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube