తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కామెడీ కింగ్స్ అంటే బాబుమోహన్ – కోట శ్రీనివాస రావు కాంబినేషనే గుర్తొస్తుంది.వీరిద్దరూ కలిసి కొన్నేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్లో అలరించారు.
వీరి కోసమే దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా సీన్లు రాసుకునే వారంటే అతిశయోక్తి కాదు.జంధ్యాల, అల్లురామలింగయ్య తర్వాత అంతటి కామెడీ పండించిన వారిలో వీరిద్దరూ నిలుస్తారు.
కోట శ్రీనివాసరావు ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటూనే బాబు మోహన్‌తో కలిసి వెండి తెరపై తెగ నవ్వులు పూయించారు.తాజాగా ‘ఆలీతో సరదాగా’ అనే టాక్ షో ద్వారా కోట శ్రీనివాసరావు బాబు మోహన్‌తో తన మెమోరీస్‌ను పంచుకున్నాడు.
బాబూ మోహన్ .నేను కలిసి తొలిసారిగా ‘బొబ్బిలి రాజా’ అనే మూవీలో చేశాము.ఈ సినిమాలో మా ఇద్దరి కలయికలో నాలుగు సన్నివేశాలు ఉన్నాయి.ఇక మా ఇద్దరికీ లైఫ్ ఇచ్చిన బెస్ట్ సీన్స్ అంటే ‘మామగారు‘ మూవీ.ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మా ఇద్దరి మధ్య కామెడీ సన్నివేశాలను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు.బిక్షగాడిగా బాబు మోహన్ నటన, అత్తింట్లో నేను పడే అవస్థల మధ్య.
మేమే ఇద్దరం తిట్టుకుని, కొట్టుకోవడం అందరినీ కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి.అయితే, బాబు మోహన్ ఓ మంచి టైమింగ్ ఉన్న నటుడు.
ఈ సినిమాలో నేను వాడిని తన్నే సీన్స్ చూసి బాబు మోహన్ ఎలా భరించడా అని అందరూ అనుకున్నారు.
ఆ సీన్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ చెప్పిన ప్రకారం.నేను కాలు లేపి తన్నాలి.ఎవరైనా చూస్తే నిజంగా తన్నినట్టు సీన్ పండాలని అన్నారు.
అలా నేను కాలితో టచ్ చేయగానే నిజంగానే తన్నినట్టు బాబుమోటన్ యాక్ట్ చేసేవాడు.వెంటనే కిందపడిపోయే అంత టైమింగ్ ఉన్న నటుడు బాబు మోహన్.
వాడు అంతలా మేనేజ్ చేయకపోతే అందరి దృష్టిలో తాను నిజంగానే చెడ్డవాడిని అయ్యేవాడిని.ఒక్క మాటలో చెప్పాలంటే వాడు బెస్ట్ యాక్టర్.
ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి 60 నుంచి 70 సన్నివేశాలు చేసి ఉంటామని కోట తన అనుభవాలను పంచుకున్నాడు.