ఇండియన్ క్లాసికల్ ని కామెడీ చేయబోయి చివాట్లు తిన్న కొరియన్ గాయని

ఇతర దేశాలకి చెందినవారు కొంత మంది ఇండియన్ కల్చర్ మీద ఏదో ఒక రూపంలో దాడి చేయాలని చూస్తారు.అలాగే ఇండియన్ క్లాసికల్ డాన్స్ ని అవమానించే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 Korean Singer Trolled After Mocks Indian Classical Dance Moves, Classical Dance,-TeluguStop.com

అయితే అలా చేసే ప్రతి సారి కూడా వారు సోషల్ మీడియాలో నెటిజన్లుకి టార్గెట్ అవుతూ ఉంటారు.ఇండియన్ కల్చర్ ని ఇష్టపడే చాలా మంది అలా అవమానించే వారిని ట్రోల్ చేస్తారు.

దీంతో ఇక తప్పని సరి పరిస్థితిలో చివరికి వారు క్షమాపణలు చెప్పుకుంటారు.ఇప్పుడు అలాగే దక్షిణ కొరియా గాయని లీ సన్ మీ అలియాస్ సన్మీ కూడా ఇండియన్ క్లాసికల్ డాన్స్ ని అవమానించే ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొంది.

ఎంతో పాప్యులారిటీ అందుకున్న ఆమె అత్యుత్సాహంతో భారత శాస్త్రీయ నృత్యాన్ని అవహేళన చేస్తున్న రీతిలో ఓ టిక్ టాక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

సన్మీ ఇటీవల ఓ టిక్ టాక్ వీడియో చేసింది.

అందులో ఆమెతో పాటు మరో ఇద్దరు డ్యాన్సర్లు కూడా ఉన్నారు.అయితే వారందరూ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ స్టెప్పులను ఇష్టంవచ్చినట్టు వేయడం ఆ వీడియోలో కనిపించింది.

అందులో నిర్లక్ష్యపూరితమైన స్టెప్పులతో భారత శాస్త్రీయ నృత్యం పట్ల అవమానకరంగా ప్రవర్తించారంటూ నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు.దాంతో సన్మీ వెంటనే తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరింది.

ఇతర దేశాల సంస్కృతి, సంప్రదాయాలను అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది.కొన్ని దేశాల సంస్కృతుల గురించి తెలియకపోవడం తన అజ్ఞానమేనని అంగీకరించింది.

అందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని ట్విట్టర్ లో వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube