సారంగా దరియా క్రేజ్ మాములుగా లేదుగా.. కొరియన్ అమ్మాయి పాడిందిగా!

అక్కినేని నాగ చైతన్య, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లవ్ స్టోరీ“.ఈ చిత్రం ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

 A Korean Girl Sings Sai Pallvi Saranga Dariya Song, Saranga Dariya Song, Korean-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి “సారంగదరియా” పాట సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే “దాని కుడి భుజం మీద కడవా” అనే పాట ఇప్పటికీ ప్రతి ఒక్కరి నోటిలో మెదులుతూనే ఉంటుంది.

సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటకు సాయిపల్లవి స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలోనే ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ.

ఏకంగా 332 మిలియన్ వ్యూస్ సాధించింది.అయితే సారంగదరియా పాట మనరెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఈ పాటకు ఏకంగా కొరియాలో కూడా మంచి స్పందన రావడం గమనార్హం.ఈ క్రమంలోనే కొరియాకు చెందిన ఓ యువతి ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు.

ఈ క్రమంలోనే కొరియాకు చెందిన ఓ యువతి తెలంగాణ యాసలో ఈ పాటను పాడి అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచారు.ఇదిలా ఉండగా కొరియా యువతి పాడిన ఈ పాటను యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.ఇప్పటివరకు ఈ వీడియోకి తొమ్మిది లక్షల వ్యూస్ వచ్చాయంటే ఇది ఏ స్థాయిలో వైరల్ అవుతుందో అర్థమవుతోంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ,సాయిపల్లవి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube