మనుషులైతే వినాలి కదా అంటున్న కొరటాల

కరోనా నివారణకు మాస్క్‌లు వాడమంటూ నెత్తి నోరు బాదుకుని మరీ కొందరు జనాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వం మాస్క్‌ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తుంది.

 Koratala Siva Tweet Wiral In Social Media, Koratala Siva, Twitter,acharya, Bhara-TeluguStop.com

అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు.సినీ ప్రముఖులు చిరంజీవి ఇటీవలే మీసం మెలేయడం కంటే.

అందంగా కనిపించడం కంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్‌ ధరించడం ముఖ్యం అంటూ సందేశం ఇచ్చాడు.

ఇలా పలువురు సినీ ప్రముఖులు మాస్క్‌ యొక్క ఆవశ్యకతను సున్నితంగా చెప్పారు.

ఇప్పుడు కొరటల శివ కూడా మాస్క్‌ యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు ముందుకు వచ్చారు.అయితే ఆయన కాస్త ఘాటుగా మనుషులు అయ్యి ఉంటే ఇప్పటికైనా మాస్క్‌ పెట్టుకునే వారు.

కాని జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తూ మాస్క్‌లను పెట్టుకోవడం లేదు అంటూ ట్విట్టర్‌ ద్వారా అసహనం వ్యక్తం చేశాడు.మాస్క్‌లను ధరించండి అంటూ ఎంతగా చెప్పినా కూడా జంతువుల మాదిరిగా మాకు కాదు అన్నట్లుగా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ఆయన ప్రశ్నించాడు.

Telugu Acharya, Chiranjeevi, Coronavirus, Face, Koratala Siva-

కొరటాల శివ సినిమాల విషయానికి వస్తే చివరగా భరత్‌ అనే నేను చిత్రం తర్వాత చిరంజీవితో సినిమా అనుకున్నాడు.చాలా కాలం వెయిట్‌ చేసిన తర్వాత చిరంజీవి ఆచార్య చిత్రానికి డేట్లు ఇచ్చాడు.సినిమా 40 శాతం పూర్తి అయిన తర్వాత కరోనా వచ్చింది.దాంతో సినిమా ఆగిపోయింది.ఎప్పటికి సినిమా మళ్లీ ప్రారంభం అయ్యేనో తెలియక చిరాకులో కొరటాల ఇలా జంతువులు అంటూ ట్వీట్‌ చేసి ఉంటాడు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube