ఎవరిని ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలంటున్న హిట్ డైరెక్టర్…  

Koratala Siva Tollywood Director - Telugu Acharya, Cast And Crew Utilization, Koratala Siva, Megastar Chiranjeevi, Tollywood, Tollywood Director

టాలీవుడ్ లో ఎక్కువ శాతం రేటు ఉన్నటువంటి దర్శకుల్లో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఒకడు.ఇతడు తన చిత్రాల్లో హీరోలను ఎలివేట్ చేస్తూ చూపించే హీరోయిజం, మరియు మెసేజింగ్ వంటి వాటికి పెట్టింది కొరటాల శివ పేరు.

 Koratala Siva Tollywood Director

అందువల్లే కొట్టాల శివకి కొంతమేర ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.అయితే తాజాగా దర్శకుడు కొరటాల శివ తన చిత్రాల్లో నటించే నటీనటులను ఉపయోగించే తీరుపై పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేశాడు.

అయితే ఇందులో ఎంతటి స్టార్డం కలిగిన నటి లేదా నటుడు అయినా పాత్రకి అవసరమైనంత మేరకే వాడుకోవాలని అలా కాకుండా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం కదా అని అనవసరమైన సన్నివేశాలలో లేదా వారి కోసమే ప్రత్యేకంగా లేని సీన్లను క్రియేట్ చేయడం వంటివి చేస్తే అవి కాస్త సినిమా కథ మీద ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు.అందువల్లనే తన చిత్రాల్లో పాత్రలలో నటించే నటీనటులకు ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత వరకే ఇస్తానని అంతేతప్ప డబ్బులు ఇస్తున్నాం కదా అని వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయడం సరి కాదని తెలిపాడు.

ఎవరిని ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలంటున్న హిట్ డైరెక్టర్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి ఆచార్య అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రంలో గెస్ట్ అప్పీయరెన్స్ రోల్ లో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులను చిత్ర యూనిట్ సభ్యులు కొంత కాలం పాటు తాత్కాలికంగా నిలిపివేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు