స్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా.. ఎంట్రీ ఫిక్స్!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్.ప్రస్తుతం టాలీవుడ్ సినీ హీరో స్థానంలో ఉన్న అఖిల్ సిసింద్రీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

 Koratala Siva To Direct Akhil Akkineni-TeluguStop.com

ఈ సినిమాతో సంవత్సరం వయసులో ఉన్న బాలనటుడిగా నటించిన అఖిల్.బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలో నటించగా ఈ సినిమాలు అంత సక్సెస్ ఇవ్వలేదు.

 Koratala Siva To Direct Akhil Akkineni-స్టార్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా.. ఎంట్రీ ఫిక్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్.

ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా కంటే ముందు నటించిన సినిమాల్లో అంత సక్సెస్ అందుకోకపోగా ఈ సినిమాపై ఆశలు పెంచుకున్నాడు అఖిల్.ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాకు ఏజెంట్ అనే టైటిల్ కూడా ప్రకటించగా ఈ సినిమా గురించి బాగా ప్రచారాలు జరుగుతున్నాయి.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.లేదంటే ఇదివరకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది.ప్రస్తుతం ఈ రెండు సినిమాలతో లైన్ లో ఉన్న అఖిల్ మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా గురించి కొరటాల శివను నాగార్జున కలిశారని, అఖిల్ తో సినిమా చేయించడానికి తను ఓకే అన్నట్లు కూడా తెలిసింది.మొత్తానికి అఖిల్ వరుస సినిమాలలో అవకాశాలు అందుకోగా ఇవి అఖిల్ కెరీర్ లో ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

#Nagarjuna #Akhil Akkineni #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు