దేవర కథ 12 ఏళ్ల ప్రయాణం.. కొరటాల శివ కీలక విషయాలను రివీల్ చేశారుగా!

కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా 27వ తేదీన విడుదల కానుంది.ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.

దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానుల హంగామా మొదలైంది.

ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు.

Advertisement

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాగా ఈ సినిమా కథాంశం 80 90 ల మధ్య జరిగిన కథగా ఉండబోతోందట.పర్టిక్యులర్ గా కొన్ని సంఘటనలు ఆ టైమ్ పీరియడ్ లో జరిగాయి.

అందుకే దేవర సినిమా( Devara movie) సెటప్ అంతా కూడా 80 నుంచి 90 దశకం మధ్యలోనే పెట్టడం జరిగిందని వివరణ ఇచ్చారు.దేవర కథను 2000 2010 మధ్యకాలంలో చెప్పలేమని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో 12 ఏళ్ళ జర్నీ ఉంటుందని తెలియజేశారు.కొరటాల శివ చెప్పిన మాటల బట్టి రియల్ సంఘటన స్ఫూర్తితోనే దేవర కథని రాసి ఉంటారనే మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ కి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.

ఆ సినిమాపైనే నిఖిల్ అభిమానుల ఆశలు.. అభిమానుల కోరిక నెరవేరుతుందా?
అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?

మూవీ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్( Jr ntr ) కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా దేవర నిలుస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.ఈ సినిమా తప్పకుండా భారీగా కలెక్షన్లను రాబడుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అంతేకాకుండా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి.

తాజా వార్తలు