నీవు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు.. దేవరకొండ గురించి కొరటాల వ్యాఖ్యలు

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 Koratala Siva Promise To Make A Film With Vijay Devarakonda-TeluguStop.com

తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను భారీ ఎత్తున హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొరటాల శివ పాల్గొన్న విషయం తెల్సిందే.ఈ సందర్బంగా కొరటాల శివ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

కొరటాల శివ మాట్లాడుతూ.‘పెళ్లి చూపులు’ సినిమా చూసినప్పుడు విజయ్‌ దేవరకొండ కోసం ఒక కథను సిద్దం చేయాలని భావించాను.అప్పుడు ఒక స్టోరీ లైన్‌ను అనుకున్నాను.పెళ్లి చూపులు హీరోతో తాను రెడీ చేసిన కథతో సినిమా చేద్దాం అనుకుంటున్న సమయంలో ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో విజయ్‌ వచ్చాడు.

పూర్తి విరుద్దమైన పాత్రను అందులో చేశాడు.అర్జున్‌ రెడ్డి తరహా కథను సిద్దం చేద్దాం అనుకుంటున్న సమయంలో గీత గోవిందంతో వచ్చాడు.తన సినిమా సినిమాకు వేరియేషన్స్‌ చూపిస్తూ వస్తున్నాడు.

తాజాగా నోటా చిత్రాన్ని నేను చూశాను.సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులో కూడా చాలా విభిన్నమైన పాత్రను విజయ్‌ చేశాడు.

ఇలా తన ప్రతి సినిమాకు వేరియేషన్స్‌ చూపిస్తున్న విజయ్‌ కోసం నేను కథ చేయలేక పోతున్నా.త్వరలోనే విజయ్‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నాను, అతడికి తగ్గ కథను నేను సిద్దం చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

కొరటాల శివ కథను సిద్దం చేస్తాను అన్నప్పుడు విజయ్‌ దేవరకొండ డన్‌ అన్నట్లుగా సిగ్నల్‌ ఇచ్చాడు.టాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒక్కడైన కొరటాల శివ వంటి దర్శకుడు విజయ్‌ దేవరకొండ గురించి ఇలా మాట్లాడటం అందరికి ఆశ్చర్యంను కలిగించింది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.విజయ్‌ దేవరకొండతో కొరటాల శివ మూవీకి చాలా చాలా ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube