‘NTR30’ నుండి మేకర్స్ సెన్సేషనల్ అప్డేట్.. ఈ మూవీ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా?

తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది.గత కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యురల్ షూట్ కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

 Koratala Siva Prepares Solid Plan For Ntr30 2-TeluguStop.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా కొరటాల శివ ( Koratala Siva ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.

ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

మరి ఈ సినిమా లాంచ్ కోసం ఎంతో కాలంగా తారక్ ఫ్యాన్స్ ఎదురు చూసారు.ఎట్టకేలకు ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూట్ కు కూడా వెళ్లనుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ అందించారు.ఈ రోజు 11 గంటలకు సాలిడ్ అప్డేట్ ఇస్తున్నట్టు ముందు నుండి బజ్ వినిపించింది.మరి వచ్చిన బజ్ నిజం చేస్తూ ఈ రోజు ఈ సినిమా నుండి మేకర్స్ మంచి న్యూస్ అందించారు.ఇందులో మరొక హాలీవుడ్ టెక్నీషియన్ యాడ్ అయినట్టు కన్ఫర్మ్ చేసారు.

ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం బ్రాడ్ మిన్నిచ్ ను టీమ్ లోకి ఆహ్వానించారు.

ఈయన ఎన్నో హాలీవుడ్ ( Hollywood) మూవీస్ కు పని చేసిన అనుభవం ఉంది.ఈయన ఈ టీమ్ లో జాయిన్ అయినట్టుగా అప్డేట్ ని అందించారు.ఈ మేరకు కొరటాల, బ్రాడ్ మిన్నిచ్ (Brad Minnich) పిక్ ను షేర్ చేసారు.

మరి ఈయన హాలీవుడ్ పరిజ్ఞానం మన తెలుగు సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుందో కొరటాల ఈ సినిమాలో విజువల్స్ ను ఏ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube