ఒకదానిని మించి మరొకటి సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నాడు క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా తెరకెక్కిస్తోన్న కొరటాల ఈ సినిమా కథ విషయంలో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
ఈ కథ నాదే అంటూ నండూరి రాజేష్ అనే మరో అసిస్టెంట్ డైరెక్టర్ మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం.ఆ వెంటనే కొరటాల దానికి కౌంటర్ ఇవ్వడం తెలిసిందే.
ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కొరటాల శివ నిర్మాత అవతారం ఎత్తుతున్నాడు.
అయితే కొరటాల ఓ సినిమాకు నిర్మాతగా మారడం కాదు.
ఆయన నిర్మాణంలో కిరణ్ అనే నూతన దర్శకుడికి అవకాశం ఇస్తూ ఓ వెబ్ సీరిస్ రూపొందనుంది.దీనిని కొరటాలే స్వయంగా నిర్మించనున్నారు.
ఈ సీరిస్‌కు కొరటాలే స్వయంగా స్క్రిఫ్ట్ కూడా ఇచ్చారట.స్క్రిఫ్ట్ తాను సమకూర్చడంతో పాటు కొరటాలే తన భార్య సమర్పణలో దీనిని నిర్మిస్తున్నారట.
ఇక ఈ వెబ్‌సీరిస్ అంతా ఇండస్ట్రీలో ఉండే కష్టాలు, మోసాలు.ఒకరి టాలెంట్ మరొకరు ఎలా దోచుకుంటారు ? అనే అంశాలతో పాటు సినిమాపై కొందరికి ఉండే ప్రేమ, నిజాయితీ లాంటి అంశాలను కూడా ఎలివేట్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొరటాల టాలెంట్ అనేది ఇక్కడ ఎలా దోపిడీకి గురవుతుందో ? అనే విషయం చూపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.ఇది ఇండస్ట్రీలోనే మరో స్టార్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసేలా కొంత స్టోరీ ఉంటుందంటున్నారు.
గతంలో ఆ డైరెక్టర్ హిట్ సినిమాకు తాను కథ ఇచ్చినప్పుడు స్క్రీన్ మీద తన పేరు రాకుండా చేశారని కొరటాల ఆరోపించారు.తర్వాత దీనిపై ఆ స్టార్ డైరెక్టర్ కూడా స్పందిస్తూ ఆ కథ కొరటాల మాత్రమే ఇవ్వలేదని.
ఆ సినిమాకు చాలా మంది పనిచేశారని చెప్పారు.
ఆ తర్వాత కొరటాల వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
నాడు తనకు జరిగిన అన్యాయంపై ఓ కథను ఇప్పుడు సీరిస్‌లో కొన్ని ఎపిసోడ్లలో చూపించేలా కొరటాల స్క్రిఫ్ట్ రాసుకున్నారని వార్తలు వస్తున్నాయి.మరి ఈ స్క్రిఫ్ట్‌లో ఆ స్టార్ డైరెక్టర్‌ను ఎంత వరకు టార్గెట్ చేశాడన్నది తెలియాలంటే ఆ వెబ్ సీరిస్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.!
.