ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ అందరూ బీ ది రియల్ మ్యాన్ అంటూ ఓ ఛాలెంజ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఇప్పటికే అర్జున్ రెడ్డి చిత్ర డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ ఛాలెంజ్‌ను రాజమౌళికి విసరడం, ఆయన ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లకు విసిరిన సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు.ఈ క్రమంలో తారక్, ఈ ఛాలెంజ్ చేయాల్సిందిగా స్టార్ డైరెక్టర్ కొరటాలను కోరాడు.
దీంతో కొరటాల తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ ఛాలెంజ్న యాక్సెప్ట్ చేశాడు.‘గతనెల రోజులుగా చేస్తున్న పనికి వీడియో ఫుటేజీ మిస్ అయ్యింది అన్నయ్యా.
’ అంటూ చెప్పుకొచ్చాడు.దీంతో నెటిజన్లు కొరటాల ట్వీట్‌కు కడుపుబ్బా నవ్వుతున్నారు.
లాక్డౌన్ కారణంగా గత నెలరోజులుగా కొరటాల ఇంటిపని చేస్తున్నట్లు ఈ ట్వీట్‌తో చెప్పుకొచ్చాడు.మొత్తానికి తారక్-కొరటాల మధ్య ఉన్న క్లోజ్ రిలేషన్‌ను ఈ సరదా ట్వీట్ ద్వారా ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు.