ఎన్టీఆర్ ను కలిసిన కొరటాల.. పిక్ వైరల్..!

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడా అని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ ఉన్నారు.

 Koratala Siva Meets Junior Ntr Pic Viral-TeluguStop.com

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడో క్లారిటీ వచ్చేసింది.ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కొరటాల శివతో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.అయితే ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఎన్టీఆర్ ను దర్శక నిర్మాతలు కలిసి నట్టు తెలుస్తుంది.

 Koratala Siva Meets Junior Ntr Pic Viral-ఎన్టీఆర్ ను కలిసిన కొరటాల.. పిక్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Janata Garage, Koratala Shiva, Koratala Siva Meets Junior Ntr, Mikkilineni Sudhakar, Nandamuri Kalyan Ram, Ntr, Ntr 30th Movie, Ntr And Koratala Shiva Movie, Ntr Arts, Ntr Latest Movie, Ntr Movie Update, Ntr30, Rrr, Viral Photo-Movie

ఈ సందర్భంగా కొరటాల శివ, మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.ఈ సినిమాను జూన్ లో సెట్స్ మీదకు తీసుకువెళ్లే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు.ఈ సినిమా ఏప్రిల్ 29 2022 న విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు.వీరి కాంబినేషన్ లో ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టింది.

అయితే మరొకసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వుతుండడంతో ఇప్పటికే అభిమానులు అంచనాలు పెంచేసుకున్నాడు.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

#NtrAnd #Ntr 30th Movie #KoratalaSiva #NTR30 #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు