కొరటాల చివరి సినిమా ఆ హీరోతోనే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Koratala Siva, Chiranjeevi, Acharya, Vijay Devarakonda-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయినట్లు కొరటాల ఇటీవల తెలిపాడు.

కాగా రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

సినిమాల నుండి మరికొద్ది కాలంలో రిటైర్ కానున్నట్లు కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ఈ సమయంలో ఆయన 5 లేదా 6 సినిమాలు చేసి కొత్త ట్యాలెంట్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

కాగా కొరటాల చివరి సినిమా ఎవరితో ఉంటుందా అనే అంశం కూడా అప్పుడే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.అయితే ఈ సినిమాను కొరటాల టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాడట ఈ స్టార్ డైరెక్టర్.మరి నిజంగానే దేవరకొండ హీరోతో కొరటాల చివరి సినిమా చేస్తాడా అనేది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube