థియేటర్లను కూరగాయల మార్కెట్‌తో పోల్చిన కొరటాల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Koratala Siva Comments On Theatres Re Open, Koratala Siva, Acharya, Theatres, Ch-TeluguStop.com

ఇక ఇటీవల మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమా కథ తనదేనంటూ ఓ రచయిత వివాదానకి తెరలేపిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా కథ పూర్తిగా తనదే అంటున్నాడు చిత్ర దర్శకుడు కొరటాల శివ.

ఈ విషయంపై ఎక్కడివరకైనా వెళ్లేందుకు తాను రెడీ అంటున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో తిరిగి ప్రారంభించి, సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని ఆయన భావిస్తున్నాడు.

ఈ క్రమంలో ఆచార్య సినిమాను కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చాడు.ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని కొరటాల చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్లు మూతపడ్డాయని, త్వరలోనే అవి తిరిగి తెరుచుకోగానే జనం మళ్లీ థియేటర్లవైపు పరుగులు తీస్తారని ఆయన అంటున్నాడు.కూరగాయల కోసం జనం ఎలాగైతే వెళ్తున్నారో, అలాగే థియేటర్లలో సినిమాలు చూసేందుకు వెళ్తారని ఆయన అంటున్నాడు.

అయితే కరోనా నేపథ్యంలో థియేటర్లు తెరుచుకున్నా, జనం సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్లాలనే ఆసక్తి చూపకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.మరి కొరటాల ఎందుకంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో ఆయనకే తెలియాలని వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube