చిరు 152 మొదలెట్టకుండానే ఆ విషయాన్ని ప్రకటించిన కొరటాల శివ, ఫ్యాన్స్‌ పిచ్చ హ్యాపీ  

Koratala Siva Announce The Mega 152 Movie Release Date-koratala Siva,mega Star Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కొన్ని ఏరియాల్లో మినహా ఎక్కువ శాతం ఈ చిత్రం సక్సెస్‌ అయ్యింది.ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌ కిక్‌తో చిరంజీవి తన 152వ చిత్రంను చేసేందుకు సిద్దం అవుతున్నాడు.మెగా 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.రామ్‌ చరణ్‌ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు.

Koratala Siva Announce The Mega 152 Movie Release Date-koratala Siva,mega Star Chiranjeevi Telugu Tollywood Movie Cinema Film Latest News Koratala Siva Announce The Mega 152 Movie Release Date-koratal-Koratala Siva Announce The Mega 152 Movie Release Date-Koratala Star Chiranjeevi

ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

హీరోయిన్‌ విషయం.టైటిల్‌ విషయం.కథ విషయం ఇలా అన్ని విషయాల గురించి జరుగుతుండగా దర్శకుడు కొరటాల శివ మొదటి సారి సినిమా విడుదల తేదీ విషయమై సన్నిహితుల వద్ద ప్రకటించాడు.వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 14వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.ప్రస్తుతం సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.

షూటింగ్‌ కోసం సర్వం సిద్దం చేస్తున్నాడు.

సినిమా కోసం సిద్దం చేస్తున్న సెట్టింగ్స్‌ మరియు ఇతరత్ర విషయాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.దేవాలయాల నేపథ్యంలో సినిమా ఉంటుంది కనుక ఎక్కువ దేవాలయాల సెట్టింగ్స్‌ను వేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని ఈ చిత్రంలో చూపించబోతున్నారట.ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించబోతుందని, ముఖ్య పాత్రలో ఈషా రెబ్బ నటించనుందని అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో చిరంజీవి డబుల్‌ రోల్‌ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.సినిమా ప్రారంభం అయిన తర్వాత వీటన్నింటిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.