మహేష్‌ బాబుతో కొరటాల రెండు... వాటి వివరాలు ఇదుగో  

Koratala Siva And Melkoti Sudhaker Produce The Mahesh Babu Twenty Seventh Movie -

మహేష్‌ బాబు తాజాగా తన 25వ చిత్రం ‘మహర్షి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మహర్షి చిత్రం 100 కోట్లను దక్కించుకున్న నేపథ్యంలో మహేష్‌ బాబు స్థాయి ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది.

Koratala Siva And Melkoti Sudhaker Produce The Mahesh Babu Twenty Seventh Movie

అద్బుతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న మహేష్‌ బాబుతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శకులు క్యూ కడుతున్నారు.ఇలాంటి సమయంలో మహేష్‌ 26వ చిత్రంకు అనీల్‌ రావిపూడికి దర్శకత్వ బాధ్యతలు దక్కాయి.

వచ్చే నెలలో మహేష్‌ బాబు 26వ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.ఇక మహేష్‌ బాబు 27వ చిత్రంకు ‘గీత గోవిందం’ ఫేం పరుశురామ్‌ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

మహేష్‌ బాబుతో కొరటాల రెండు… వాటి వివరాలు ఇదుగో-Movie-Telugu Tollywood Photo Image

మహేష్‌ బాబు 27వ చిత్రంను అల్లు అరవింద్‌ నిర్మించాల్సి ఉంది.అయితే ఆ సినిమా నిర్మాణ బాధ్యతలను కొరటాల శివ మరియు ఆయన స్నేహితుడు మేల్కోటి సుధాకర్‌లు కూడా పాలు పంచుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు అరవింద్‌తో పాటు మహేష్‌ బాబు 27వ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చూసుకునేందుకు కొరటాలకు అనుమతి దక్కిందని తెలుస్తోంది.అల్లు అరవింద్‌ ఈమద్య కాలంలో సొంతంగా సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపడం లేదు.

అందుకే మేల్కోటికి మరియు కొరటాలకు సహ నిర్మాతలుగా ఛాన్స్‌ వచ్చింది.

మహేష్‌ బాబు 27వ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.ఇక మహేష్‌ 28వ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తాడట.ఈ విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.అంటే మహేష్‌బాబు నటించబోతున్న 27 మరియు 28 చిత్రాలకు కొరటాల ప్రాతినిధ్యం వహించబోతున్నాడు.27వ చిత్రానికి నిర్మాతగా 28వ చిత్రానికి దర్శకుడిగా కొరటాల శివ వ్యవహరించబోతున్నాడు.ఇప్పటికే మహేష్‌ బాబుతో శ్రీమంతుడు మరియు భరత్‌ అనే నేను చిత్రాలను తెరకెక్కించిన కొరటాల రికార్డులను సృష్టించాడు.ఇప్పుడు మరో సినిమాతో మరెలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు