కొరటాల ఈ కన్ఫ్యూజ్‌ ఏంటీ? క్లారిటీ ఇవ్వవా ప్లీజ్‌  

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ లను దక్కించుకున్న కొరటాల శివ తదుపరి చిత్ర కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాల నడుమ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుందని గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో చిరంజీవి నటిస్తున్నాడు. ఆ చిత్రం పూర్తి అయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ఆరంభం నుండి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చిరంజీవి చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Koratala Shiva In Confusion About Movie With Jr NTR-

Koratala Shiva In Confusion About Movie With Jr NTR

ఇలాంటి సమయంలో కొరటాల శివ తన మనసును మార్చుకున్నాడని, తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయాలని భావిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. తాజాగా తన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌ స్థాపించిన యువసుధ బ్యానర్‌ గురించి ప్రకటించిన కొరటాల శివ ఆ బ్యానర్‌లో తాను కూడా భాగస్వామిగా ఉన్నట్లుగా ప్రకటించాడు. ఆ బ్యానర్‌లో ఎన్టీఆర్‌ హీరోగా మొదటి సినిమా ఉంటుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కొరటాల తన తర్వాత సినిమా యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌, కొరటాల సినిమా ఉంటుందని, సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ భారీ మల్టీస్టారర్‌కు డేట్లు కేటాయించాడు. వచ్చే ఏడాది చివరి వరకు ఆ సినిమాకే ఎన్టీఆర్‌ ఫిక్స్‌ అవ్వాల్సి ఉంది. అందుకే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. కనుక మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లే అంటూ కొందరు సినీవర్గాల వారు అంటున్నారు.

Koratala Shiva In Confusion About Movie With Jr NTR-

కాని కొందరు మాత్రం కొరటాల తన మనసును మార్చుకున్నట్లుగా గట్టిగా నమ్ముతున్నారు. ఎన్టీఆర్‌తోనే ఆయన తర్వాత సినిమా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ విషయంలో కొరటాల క్లారిటీ ఇవ్వాలని వారు ఆశిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ విషయమై ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.