వామ్మో.. కొరటాల శివ ఒక్కో సినిమాకు అంత తీసుకుంటున్నారా..?  

టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా కెరీర్ ను ప్రారంభించి దర్శకుడిగా మారి వరుస విజయాలను సొంతం చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కొరటాల శివ.ఇప్పటివరకు కొరటాల శివ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడం గమనార్హం.

TeluguStop.com - Koratala Shiva Huge Remuneration For Allu Arjun Movie

మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో సినిమా సినిమాకు కొరటాల శివ దర్శకునిగా తన రేంజ్ ను పెంచుకుంటూ వస్తున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా తరువాత కొరటాల శివ అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ సినిమాలకు దర్శకత్వం వహించనున్నారు.

TeluguStop.com - వామ్మో.. కొరటాల శివ ఒక్కో సినిమాకు అంత తీసుకుంటున్నారా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆచార్య సినిమాకు పదికోట్లకు అటూఇటుగా పారితోషికం పుచ్చుకుంటున్న కొరటాల శివ బన్నీ సినిమాకు మాత్రం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.

బన్నీ సినిమాకు కొరటాల శివ ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం.అపజయం ఎరుగని దర్శకునిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివ, రాజమౌళి, త్రివిక్రమ్ తరువాత ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న దర్శకునిగా వార్తల్లో నిలిచారు.రాజమౌళి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయలతో పాటు సినిమా లాభాల్లో వాటా తీసుకుంటారని త్రివిక్రమ్ శ్రీనివాస్ 18 నుంచి 20 కోట్ల మధ్యలో తీసుకుంటున్నారని తెలుస్తోంది.
మరోవైపు కరోనా, లాక్ డౌన్ వల్ల గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండే విధంగా కొరటాల కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.ఆచార్య మూవీ షూటింగ్ పూర్తైన తరువాత కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా మొదలు కానుంది.

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించనున్నారు.

#15 Crores #KoratalaShiva #15 Crore Rupees #Acharya #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు