కరోనా సోకిన వారు బాధ్యత విధంగా వ్యవహరించాలి అంటున్న దర్శకుడు  

Koratala Shiva Give Suggestion To Corona Positive Persons, Tollywood, Telugu Cinema, South Cinema, Corona Virus, COVID-10 -

కరోనా వైరస్ దేశంతో పాటు రాష్ట్రాలలో విపరీతంగా విజృంభిస్తుంది.తెలియకుండానే చాలా మంది దీని బారిన పడుతున్నారు.

 Koratala Shiva Give Suggestion To Corona Positive Persons

ఎలా కరోనా పాజిటివ్ తమకి వస్తుందో కూడా చాలా మందికి తెలియడం లేదు.కొంత మందికి కరోనా సోకినా కూడా వైరస్ లక్షణాలు కనిపించకపోవడంతో వారు టెస్టులు చేయించుకోవడం లేదు.

అయితే మరికొందరు కరోనా లక్షణాలు ఉన్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లేదంటే చుట్టూ జనాలకి భయపడి బయటకి రాకపోవడం జరుగుతుంది.ఇలాంటి వారి వలన కరోనా మరింతగా ఎక్కువ మందికి వ్యాపిస్తుంది.

కరోనా సోకిన వారు బాధ్యత విధంగా వ్యవహరించాలి అంటున్న దర్శకుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్దిగా ప్రయత్నం చేస్తున్న కూడా ప్రజల నిర్లక్ష్యం కారణంగానే రోగుల సంఖ్య పెరిగిపోతుంది.
తాజాగా కరోనా గురించి దర్శకుడు కొరటాల శివ ఆసక్తికరమైన పోస్ట్ ట్వీట్ చేశాడు.

కరోనా బారిన పడిన వారిలో చాలా మంది హాస్పిటల్ కి వెళ్ళడానికి, అలాగే మెడికల్ చెకప్ లు చేయించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదని అన్నారు.ఈ కారణంగా కరోనా బారిన పడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అని అన్నారు.

ఇలా కరోనా వచ్చిన కూడా బయటకి చెప్పకుండా ఉండటం కరోనా రోగం కంటే భయంకరమైన సమస్య అని అన్నారు.ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఎక్కువగా ఆలోచించి భయపడటం, నిర్లక్ష్యం వహించడం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలని పోస్టులో పేర్కొన్నారు.

కరోనా అనేది అంటరాని రోగం కాదని, వచ్చిన వారిని అలా చూడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Koratala Shiva Give Suggestion To Corona Positive Persons Related Telugu News,Photos/Pics,Images..