యాక్షన్ లేకుండానే యాక్షన్ స్టార్ట్ అంటోన్న కొరటాల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 Koratala Planning Scenes For Acharya Shooting, Koratala Siva, Chiranjeevi, Achar-TeluguStop.com

చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది.

దీంతో ఈ సినిమా ఎప్పుడు తిరిగి షూటింగ్ మొదలు పెట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో సినిమా షూటింగ్‌లు మొదలుపెట్టేందుకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో ఆచార్య చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతోంది.అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించాల్సి ఉండటంతో చాలా తక్కువ మందితో తమ సినిమా షూటింగ్‌ను నిర్వహించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

అయితే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

అయితే డైలాగులు ఉన్న సీన్స్‌నే తెరకెక్కించేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో చిరుతో కొన్ని సీన్స్‌ను తెరకెక్కించాలని, అలాగే చిత్రంలోని పలువురు నటీనటులతో కూడా షూటింగ్ నిర్వహించాలని కొరటాల చూస్తున్నాడు.ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube