మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా షూటింగ్ లో ఉన్న కొరటాల శివ ఈ సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తుంది.కొరటాల గత సినిమాల తరహాలోనే ఇది కూడా సోషల్ ఎలిమెంట్ తో నడిచే కమర్షియల్ కాన్సెప్ట్ గా తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమా తర్వాత కొరటాల సినిమాలు ఎవరితో ఉంటాయి అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో జోరుగా సాగుతుంది.ఇప్పుడు కొరటాల నెక్స్ట్ హీరోల జాబితాలో ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు వినిపిస్తుంది.
ఆచార్య సినిమా పూర్తయ్యే నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది.దీంతో రామ్ చరణ్ ఖాళీ అవుతారు.
దీంతో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ ని ఇప్పటికే లైన్ లో పెట్టేసాడని టాక్.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొరటాల మొదటి సినిమా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వం రాదే శ్యాం సినిమా చేస్తున్నాడు.
దీని తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తోనే తెరకేక్కుతున్నాయి.ఈ రెండు పూర్తయ్యేసరికి రెండేళ్ళు పడుతుంది.ఆ తరువాత ప్రభాస్ లిస్టు లో సందీప్ రెడ్డి వంగా పేరు వినిపిస్తుంది.
ఇప్పుడు కొరటాల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఇక ప్రభాస్ కొరటాల కాంబినేషన్ లో సినిమా సెట్ చేయాలని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్లాన్ చేస్తుంది.
మరి ఇది ఎప్పటికి వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాలి.