ఆచార్యతో ముగించాక కొరటాల ఏం చేస్తాడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Koratala Next Movie With Ram Charan After Acharya-TeluguStop.com

మెగాస్టార్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కథను కొరటాల అదిరిపోయే రీతిలో రాసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తరవాత కొరటాల తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తారా అనే అంశం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తకరంగా మారింది.

గతంలో మిర్చి సినిమా తరువాత కొరటాల తన నెక్ట్స్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.

కాగా ఇప్పుడు ఆచార్య సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని రామ్ చరణ్‌తో చేయడానికి కొరటాల రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే క్రమంలో ఇప్పుడు చరణ్‌తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెడీ చేసేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.

కాగా చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube