వివాదంలో కొరటాల శివ

శ్రీమంతుడు చిత్రంతో భారి బ్లాక్బస్టర్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ వివాదంలో చిక్కుకున్నారు.అయన మీద కాపిరైట్స్ ఉల్లంఘన నేరం ఆధారంగా ఫిలిం ఛాంబర్ లో కేసు వేసారు రచయిత శరత్ చంద్ర.

 Koratala In Controversy-TeluguStop.com

వివరాల్లోకి వెళ్తే, 2012 లో శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమ అనే ప్రముఖ నవల స్వాతి పత్రికలో ప్రచురితమైంది.శరత్ చంద్ర రాసిన అదే కథ ఆధారంగా సముద్ర దర్శకత్వంలో హీరో నారా రోహిత్ చేయాల్సిన సినిమా కొన్ని కారణాల వలన లేట్ అవుతూ వచ్చింది.

జయలక్ష్మీ ఫిలిమ్స్ అనే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంది.

మహేష్ బాబు శ్రీమంతుడు కథ, శరత్ చంద్ర రాసిన ఒకటే అని, కొరటాల ఆ కథను కాపి కొట్టారన్నది జయలక్ష్మీ ఫిలింస్ ఆరోపణ.

దీనిపై రచయిత శరత్ చంద్ర మాట్లాడుతూ ” కేరళ లో ఉన్న నేను కొందరు రచయిత మిత్రుల సూచనలతో శ్రీమంతుడు సినిమా చూసాను.దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో నా నవలకు సంబంధించిన పలు అంశాలు కలిసాయి.

స్క్రిప్ట్ కాపీ చేసారని, నిజ నిర్ధారణ కోసం కమిటీ వేయమని కోరాను.రచయితల సంఘం సభ్యుడిగా ఉన్న నేను సంస్థ కార్యదర్శి ఆకెళ్ళ గారికి ఆధారాలతో లేఖ ఇచ్చాను.

మరోసారి ఇలాంటి పనులు జరగకూడదనే ఉద్దేశ్యంతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది.మాకు జరిగిన ఈ అన్యాయం మరో రచయితకు జరగకూడదు.

ఇలా కాపీ చేసేవారిని ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి ” అంటూ కోరటాల మీదకి సమరశంఖం ఊదారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube