గుండుతో గుబులుపుట్టిస్తున్న చిరు.. పీక్స్‌కు చేరిన కొరటాల కోపం!  

Koratala Frustrated With Chiranjeevi New Look, Koratala Siva, Chiranjeevi, Chiranjeevi New Look, Meher Ramesh, Tollywood News - Telugu Chiranjeevi, Chiranjeevi New Look, Koratala Siva, Meher Ramesh, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే సగం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Koratala Frustrated With Chiranjeevi New Look

ఇక సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో చిరు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ ప్రాజెక్టులను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఆచార్య చిత్రంలో చిరు లుక్ ఎలా ఉండబోతుంది ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తెలిసింది.

గుండుతో గుబులుపుట్టిస్తున్న చిరు.. పీక్స్‌కు చేరిన కొరటాల కోపం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ అందరికీ షాకిస్తూ చిరు తాజాగా గుండు లుక్‌తో కనిపించాడు.చిరు ఇలా కనిపించడంతో అందరూ అవాక్కయ్యారు.ఇక ఈ విషయంపై యావత్ ఇండస్ట్రీలో చర్చ తీవ్రస్థాయిలో నడుస్తోంది.చిరు ఈ లుక్‌లో ఎందుకు కనిపించాడా అని అందరూ అనుకున్నారు.

అయితే చిరు తన నెక్ట్స్ మూవీని దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను మెహర్ రమేష్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కోసమే చిరు గుండు లుక్‌లో కనిపించాడని అందరూ అనుకుంటున్నారు.అయితే చిరు ఈ లుక్‌లో దర్శనమివ్వడంతో ఆచార్య దర్శకుడు కొరటాల శివ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.ఇప్పటికే ఆచార్య చిత్రం చాలా ఆలస్యం అవుతుండటంతో, ఇప్పుడు ఇలా చిరు గుండు చేసుకోవడంతో, సినిమా షూటింగ్ ఎలా జరుపుకోవాలా అని కొరటాల భావిస్తున్నాడట.

అయితే చిరు నిజంగా గుండు చేసుకోలేదని తెలుసుకుని కొరటాల కాస్త రిలీఫ్ అయినట్లు తెలుస్తోంది.

#ChiranjeeviNew #Chiranjeevi #Koratala Siva #Meher Ramesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Koratala Frustrated With Chiranjeevi New Look Related Telugu News,Photos/Pics,Images..