ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ భామని రంగంలోకి దింపుతున్న కొరటాల

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఅర్ నెక్స్ట్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని కొరటాల ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

 Koratala Concentrate On Bollywood Heroines For Jr Ntr-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ లో తారక్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.జనతా గ్యారేజ్ సినిమాతో తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమా కాబట్టి దీని మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.

అలాగే యూనివర్శల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే సినిమా కాబట్టి ఇందులో తీసుకునే క్యాస్టింగ్ మీద కూడా అందరి దృష్టి పడుతుంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కి జోడీగా రాజమౌళి ఏకంగా హాలీవుడ్ నటిని రంగంలోకి దించారు.

 Koratala Concentrate On Bollywood Heroines For Jr Ntr-ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ భామని రంగంలోకి దింపుతున్న కొరటాల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొరటాల శివ కూడా ఆ రేంజ్ కాకున్నా బాలీవుడ్ భామని అయితే ఎన్టీఆర్ కోసం ఎంపిక చేయాలని భావిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు సౌత్ లో తెరక్కుతున్న పాన్ ఇండియా సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు.

ఒక్క హిందీ బాషకి మాత్రమే పరిమితం కాకుండా తమ మార్కెట్ స్కోప్ పెంచుకునే ఉద్దేశ్యంతో పాన్ ఇండియా సినిమాలు బెటర్ అని ఆలోచిస్తూ ఉన్నారు.ఈ నేపధ్యం కొరటాల ఎన్టీఆర్ కోసం ఓ ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.

అందులో ముందుగా కియరా అద్వానీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.దాంతో పాటు సారా ఆలీఖాన్ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు బోగట్టా.

సారా ఆలీఖాన్ చాలా కాలంగా సౌత్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తుంది.ఈ నేపధ్యంలో కొరటాల నుంచి ఎన్టీఆర్ సినిమా ఆఫర్ వస్తే కచ్చితంగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.

#Sara Ali Khan #Koratala Siva #Kiara Advani #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు