వైసీపీ మెరుగయ్యింది ... అందుకే ఆ మాజీ సీఎం చేరబోతున్నాడా ..?

వైసీపీ అధినేత జగన్ ఒక్కో అడుగు విజయం వైపే అన్నట్టుగా… ఆయనకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.ఒక వైపు ప్రజా సంకల్ప యాత్ర చేస్తూనే … మరోవైపు పార్టీలో పరిస్థితులను జగన్ చక్కబెట్టుకుంటున్నాడు.

 Konijeti Rosaiah To Join Ysrcp-TeluguStop.com

మొదట్లో వైసీపీపై ప్రజల్లో కొంచెం వ్యతిరేకత కనిపించింది.అయితే ఆ వ్యతిరేకత ను ముందుగానే గుర్తించిన జగన్ అందుకు అనుగుణంగా… తన వ్యూహాలు మార్చుకున్నాడు.

చాలా నియోజకవర్గాల్లో ఆయా ఇంచార్జిల పై వ్యతిరేకత ఉండడం… వారిలో అధిక శాతం మంది గెలుపు గుర్రాలు కాకపోవడంతో… జగన్ వారిలో చాలామందిని ఎటువంటి మొహమాటం లేకుండా పక్కనపెట్టేశారు.దీనికి తోడు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ…పార్టీ పనితీరు మెరుగయ్యేలా ప్రణాళికలు వేసుకుంటున్నాడు జగన్.

అంతే కాదు… గతంలో జగన్‌కి వ్యతిరేకంగా పనిచేసినవాళ్ళు కూడా ఇప్పుడు జగన్ గెలుపు కోసం పరోక్షంగా సహకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.నాలుగున్నరేళ్ళ పాలనతో టీడీపీ ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం జగన్ కి కలిసొచ్చే అంశాలు.తాజాగా జగన్‌కి మరో బలం కలిసిరావడం ఖాయం అయింది.మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వైసీపీలో చేరడమో, లేకపోతే జగన్‌కి మద్దతుగా మాట్లాడడమో ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మధ్య రోశయ్య తరచుగా వైసీపీ నేతలను కలుస్తున్నారు.బొత్ససత్యనారాయణతో సహా చాలా మందితో మంతనాలు జరుపుతున్నారు.

వైశ్య సామజిక వర్గం మొత్తం జగన్‌కి అండగా ఉండేలా వ్యూహరచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.కర్నూలు జిల్లాలో చంద్రబాబు వైఖరితో విసిగిపోయి ఉన్న టీజీ వెంకటేష్…ఆయన కుమారుడు కూడా జగన్ వైపు చూస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.కర్నూలు అసెంబ్లీ టికెట్ టీజీ వెంకటేష్ కొడుక్కి ఇవ్వకపోతే మాత్రం జంపింగ్ ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.రోశయ్యలాంటి నాయకుడు వైసీపీలో చేరినా, వైసీపీకి మద్దతుగా నిలబడినా రాజకీయ సమీకరణాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయనడంలో సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube