పాపం నిహారికను పూర్తిగా దూరం చేసేశారు

మెగా ఫ్యామిలీ నుండి హీరోలు చాలా మంది ఉన్నారు.కాని హీరోయిన్‌ గా మాత్రం ఒకే ఒక్క నిహారిక ఉంది.

 Konidela Niharika Out From Tamil Movie, Ashok Selvan, Megha Aakash, Mega Fans, K-TeluguStop.com

ఆమెకు నటన అంటే చాలా ఇష్టం.తనను తాను ఏదైనా కొత్త ప్లాట్‌ ఫామ్‌ మీద చూసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.

నటిగా రాణించేందుకు నిహారిక పడ్డ తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమెకు నాగబాబు నుండి ఫుల్‌ సపోర్ట్‌ దక్కింది.

ఇతర మెగా హీరోలు ఆమె విషయంలో కాస్త నిరుత్సాహంగా వ్యవహరించారు అనేది అప్పుడు వచ్చిన టాక్‌.నిహారిక మొదట హీరోయిన్‌గా నటించాలనుకుంటున్నాను అనప్పుడు ఎక్కవ శాతం మంది అవసరమా అన్నట్లుగానే ప్రశ్నించారట.

అయినా కూడా తండ్రి ప్రోత్సాహంతో నిహారిక హీరోయిన్‌గా కెరీర్‌ మొదలు పెట్టింది.కొన్ని కారణాల వల్ల ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.

వచ్చిన ఒకటి రెండు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.కమర్షియల్‌ హీరోయిన్‌గా మెగా ఫ్యాన్స్‌ ఆమెను చూడాలనుకోలేదు.

అందుకే ఆమె ఎక్కువగా పద్దతైన పాత్రల్లోనే కనిపించింది.కోలీవుడ్‌ లో కాస్త బోల్డ్‌ పాత్రలో నటించేందుకు ఇటీవలే నిహారిక ఓకే చెప్పింది.

పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో నిహారిక కమిట్‌ అయిన తమిళ సినిమాను వదిలేసిందట.అనూహ్యంగా ఆ ఆఫర్‌ నితిన్‌ హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ కు దక్కిందట.

అశోక్‌ సెల్వన్‌ దర్శకత్వంలో నిహారిక హీరోయిన్‌గా కాస్త బోల్డ్‌ సినిమాను చేయబోతున్నట్లుగా కొన్ని నెలల క్రితం ప్రకటన వచ్చింది.ఆ సినిమాకు సంబంధించి షూటింగ్‌ మొదలు పెట్టాలనుకున్న సమయానికి కరోనా కారణంగా షూటింగ్స్‌ అన్ని ఆగిపోయాయి.

దాంతో ప్రాజెక్ట్‌ చేతులు మారినట్లుగా సమాచారం అందుతోంది.నిహారికకు వివాహ నిశ్చితార్థం అయ్యింది.

ఆమె కుటుంబ సభ్యులు మరియు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి నుండి ఎలాంటి స్పందన వచ్చిందో ఏమో కాని ప్రస్తుతానికి అయితే ఆ తమిళ సినిమా నుండి నిహారిక తప్పుకున్నట్లే అంటున్నారు.అయితే నిహారిక ముందు ముందు అయినా నటించే అవకాశం ఉందా అంటే అనుమానమే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube