ప్రాణం తీసిన బట్టతల

సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వారికి చాలా బాధాకరమైన కారణాలు ఉంటాయి.కొందరు చదువులో రాణించలేదని, మరికొందరు పెళ్లి కాలేదని, అయినా విడిపోయామని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.కానీ హైదరాబాద్‌లో ఓ 18 ఏళ్ల కుర్రాడిని బట్టతల పొట్టన పెట్టుకుంది.

 Kondapoor Teenager Bold Head-TeluguStop.com

18 ఏళ్ల ఓ యువకుడు జేఈఈ పరీక్షలకు చదువుకుంటున్నాడు.అతడి తండ్రి మాదాపూర్‌లోఉద్యోగం చేయగా వారంతా కొండాపూర్‌లో నివసిస్తున్నారు.పెద్దకొడుకు ఎంబీఏ చదువుతున్నాడు.అయితే చిన్నబ్బాయికి అనారోగ్య కారణాలతో జుట్టు రాలిపోవడం మొదలైంది.దీంతో అతడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

కాగా ఇదే విషయం అతడి తల్లిదండ్రులకు కూడా చెప్పుకొచ్చాడు.

అయితే ఇంత చిన్నవయసులోనే తనకు బట్టతల వస్తుందనే ఆవేదనతో అతడు బాత్రూమ్‌లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఇంత చిన్నవయసులో బట్టతల కారణంగా ఓ నిండు ప్రాణం పోవడం నిజంగా బాధాకరం అని స్థానికులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube