టీజేఎస్ విలీనం పై స్పందించిన కోదండరాం..!

కాంగ్రెస్ పార్టీ లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) విలీనం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఈ వార్తలపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.

 Kondadaram Clarifies Tjs Merging In Congress, Clarifies Congress , Congress Part-TeluguStop.com

కాంగ్రెస్ లో టీ.జే.ఎస్ విలీనం చేస్తారంటూ వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు కోదండరాంకాంగ్రెస్ పార్టీలో టీ.జే.ఎస్ విలీనం చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

జే.

ఏ.సీగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని రేవంత్ రెడ్డి ప్రతిపాదన మాత్రం వాస్తవమే అని అన్నారు.ఇక త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా అయ్యాక పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టారు.

ఈ క్రమంలో టీ.ఆర్.ఎస్ కు వ్యతిరేక పార్టీగా పేరు తెచ్చుకున్న టీ.జే.ఎస్ ను కాంగ్రెస్మ్ పార్టీలో విలీనం చేసేందుకు మొగ్గు చూపుతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి.కోదండరాం కూడా అందుకు సానుకూలంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

అయితే ఈ వార్తలకు తన స్పందనతో ఫుల్ స్టాప్ పెట్టారు కోదడరాం.టీ.జే.ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ఉద్దేశం లేదని ఆయన ఖరాకండిగా చెప్పారు. టీ.జే.ఎస్ ఒంటరిగానే ప్రజా సమస్యల మీద పోరాడుతుందని ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube