ఈసారి నిజంగానే బీజేపీ లోకి ' కొండా ' ?

ఎప్పటికప్పుడు బిజెపిలో చేరుతున్నానంటూ హడావుడి చేయడం.చివరకు వెనక్కి తగ్గడం పరిపాటిగా మారిపోయింది మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి.

 Konda Visweswara Reddy Try To Join In Bjp , Konda Visweswara Reddy, Telangana, Congress, Revanth Reddy, Chevella Ex Mp, Kcr , Ktr, Telangana Bjp, Tarunnchug Bandi Sanjay,-TeluguStop.com

మొదట్లో టీఆర్ఎస్ ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి రాజీనామా చేసిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత తనకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కాంగ్రెస్ అధిష్టానం అప్పగించడంతో విశ్వేశ్వర్ రెడ్డి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తారని అంతా భావించారు అయితే టిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ , కేటీఆర్ లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో టిఆర్ఎస్ ను ఓడించే పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ఆయన బిజెపిలో చేరబోతున్నట్లు గా ప్రచారం జరిగింది.

ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయన రహస్యంగా మంతనాలు చేశారు.కానీ చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు సొంతంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు కొంతమంది సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు హడావుడి చేశారు.

 Konda Visweswara Reddy Try To Join In Bjp , Konda Visweswara Reddy, Telangana, Congress, Revanth Reddy, Chevella Ex Mp, Kcr , Ktr, Telangana Bjp, Tarunnchug Bandi Sanjay,-ఈసారి నిజంగానే బీజేపీ లోకి కొండా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.మళ్ళీ బిజెపిలో చేరబోతున్నట్లుగా  ప్రచారం జరిగినా,  సైలెంట్ అయిపోయారు.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన క్రమంలో  విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని  భావించారు.కానీ అప్పుడు ఆయన మౌనంగా ఉండిపోయారు.

  అయితే ఇప్పుడు ఖచ్చితంగా బిజెపిలో చేరబోతున్నట్లుగా విశ్వేశ్వర్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు.

Telugu Chevella Mp, Congress, Kondavisweswara, Revanth Reddy, Tarunnchugbandi, Telangana, Telangana Bjp-Politics

అయితే ఈ రోజు తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం దీంతో విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ లోకి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.త్వరలో హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై రెండో తేదీన హైదరాబాద్ కు రానున్నారు.ఆయన సమక్షంలోనే విశ్వేశ్వర్ రెడ్డి బిజెపి కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

దీనికి తగ్గట్లుగానే విశ్వేశ్వర్ రెడ్డి సైతం తాను మంచి ముహూర్తం చూసుకుని ఆ రోజున బీజేపీ కండువా కప్పుకుంటానని బండి సంజయ్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube