ఈటెల రాజేందర్ ఎపిసోడ్‌లో చోటు చేసుకున్న మరో కీలక పరిణామం.. ?

తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి.ఇప్పటికే పొలిటికల్ వార్‌లో భూములకు సంబంధించిన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో హట్ టాపిక్‌గా మారింది.

 Konda Vishweshwar Reddy Met With Etela-TeluguStop.com

అసలు ఈటలను పార్టీ నుండి బయటకు పంపించే వ్యవహారంలో ఎన్నో కీలక పరిణామాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగాయని ప్రచారం జరుగుతుండగా ఇక ఈటల కూడా తర్వాత వేసే అడుగులు ఏంటనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
మరి ఈటల పొలిటికల్ మైలేజీ అమాంతంగా పెరుగుతుందా లేదా అనేది ఒక ప్రశ్నగానే మిగిలింది.

ఇదిలా ఉండగా శామీర్‌పేట‌లోని ఈటెల రాజేందర్ నివాసంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి భేటీ అయ్యారు.కాగా చేవెళ్ల ఎంపీగా 2018లో పోటీచేసి ఓడిపోయిన కొండా అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌కు దూరంగానే ఉంటున్నారు.

 Konda Vishweshwar Reddy Met With Etela-ఈటెల రాజేందర్ ఎపిసోడ్‌లో చోటు చేసుకున్న మరో కీలక పరిణామం.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదీగాక అప్ప‌టి నుంచి ఆయ‌న భవిష్యత్ కార్యాచ‌రణ కూడా ప్రకటించలేదు.ఈ క్రమంలో సొంతంగా పార్టీపెడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.అయితే తాజాగా ఈట‌ల‌ను క‌ల‌వ‌డం వెన‌క ఇదే అంశం ఉంద‌ని ప్రచారం జరుగుతుంది.కానీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాత్రం ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలేమీ లేవని, ఈటల భార్య జమున తమకు బంధువని, అందుకే కేవలం సానుభూతితో మాత్రమే ఆయనను కలవడానికి వచ్చానని వెల్లడించారు.

#Shamirpet #Etela Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు