రూటు మార్చిన కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. మ‌ళ్లీ హ‌స్తం గూటికేనా..?

తెలంగాణ రాజ‌కీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి.ఒక పార్టీలో ఉంటార‌నుకున్న వారు అనూహ్యంగా రాజీనామాలు చేస్తున్నారు.

 Konda Vishweshwar Reddy Changed The Route Is Going Back To Congress Party, Revan-TeluguStop.com

మ‌రో పార్టీలోకి వెళ్తార‌ని ప్ర‌చారం జ‌రిగిన నేత‌లు ఊహించ‌ని విధంగా ఇంకో పార్టీలో చేరుతున్నారు.ఇప్పుడు ఇదే క్ర‌మంలో రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్ కొంద‌రిని కాంగ్రెస్ పార్టీకి దూరం చేస్తే మ‌రి కొంద‌రిని ద‌గ్గ‌ర చేస్తోంది.

ఆయ‌న బాధ్య‌త‌లు తీసుకున్న రోజే కొంద‌రు రాజీనామాలు కూడా చేసిన విష‌యం తెలిసిందే.ఇక నిన్న అనూహ్యంగా హుజూరాబాద్ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కౌశిక్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు.

అయితే రేవంత్‌మాత్రం వీటిని ప‌ట్టించుకోకుండా త‌న ప‌నిని తాను చేసుకుంటూపోతున్నారు.కాంగ్రెస్‌కు దూర‌మైన వారితో మంత‌నాలు జ‌రుపుతూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి కలిసి ఈరోజు చాలా విష‌యాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.ఆయ‌న కొంత కాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.

ఆయ‌న మొద‌ట టీఆర్ఎస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుచి, రెండోసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టికెట్ రాక‌పోవ‌డంతో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

Telugu @revanth_anumula, Koushik Reddy, Revanth Reddy, Congress, Telangana, Tpcc

కాక‌పోతే మొన్న జ‌రిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓట‌మి త‌ర్వాత కొండా కాంగ్రెస్‌ పార్టీని వీడి ఒంట‌రిగానే ఉంటున్నారు.అయితే ఆయ‌న ఈ క్ర‌మంలో పలువురు కీల‌క నేతలతో అలాగే చాలా మంది ఇత‌ర పార్టీలోని వ్య‌క్తుల‌తో కూడా చ‌ర్చ‌లు జ‌రిపారు.కానీ ఏ పార్టీలో కూడా చేరేందుకు ఆయ‌న ఇంట్రెస్ట్ చూపించ‌లేదు.

ఇక ఇప్పుడు రేవంత్‌రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ కావ‌డంతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.ఆయ‌న్ను మ‌ళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు రేవంత్ ట్రై చేస్తున్నారు.అందులో బాగంగానే ఈరోజు ఆయ‌న‌తో భేటీ అయ్యారు.మ‌రి కొండా కొంగ్రెస్ గూటికి వ‌స్తారా లేదా అన్న‌ది మాత్రం వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube