తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ పదవి రేస్ లోకి కొండా సురేఖ

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి రేసులో కొండా సురేఖ పేరు వినపడుతుంది.ఇప్పటి వరకు ఈ పదవి కోసం రేవంత్ రెడ్డి వర్గం.

 Konda Surekha In Tpcc Chief Race, Konda Surekha,  Tpcc Chief Race, Revanth Reddy-TeluguStop.com

కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వర్గం పోటీలో ఉన్నాయి.ఇరు వర్గాలు పరస్పరం ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డి కి అప్పజెప్పితేనే బాగుంటుందని కాంగ్రెస్ అధిస్థానం భావిస్తున్న తరుణంలో వి హనుమంత్ రావు, రేవంత్ రెడ్డి పై రెండు రోజుల కిందట తీవ్రమైన విమర్శలు చేశాడు.టి‌డి‌పి ని ముంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ కి ఎలా ఇస్తారు అంటూ మండి పడ్డాడు.

ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఏది చెబితే అది వినలా అంటూ వారికి వ్యతిరేకంగా మాట్లాడాడు.ఈ విషయం గురించి హనుమంత్ రావు పై క్రమ శిక్షణ రహిత చర్యలు తీసుకోవడానికి అధిష్టానం సిద్దం అవ్వుతుంది.

తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ నుండి వస్తున్న వార్తల నేపథ్యంలో రేవంత్ రెడ్డిని, కోమటి రెడ్డిని కాదని మహిళ కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.ఆ దిశగా కొండ సురేఖ పేరును పరిశీలిస్తున్నారు.

ఈమె గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.ప్రత్యర్ది పార్టీలపైన మాటల దాడి చెయ్యడంలో ఆమెకు తిరుగుండదు.

పైగా రాష్ట్రంలో ఉన్న రెండు బి‌సి సామాజికవర్గాల్లో మంచి పేరు ఉంది.ప్రస్తుతం మహిళ కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శిగా కొనసాగుతున్న సీతక్కకు రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పజెప్పాలని అధిస్థానం భావిస్తుంది.

ఆదివాసిలో సీతక్కకు మంచి పేరు ఉంది.రెండు సార్లు ఎం‌ఎల్‌ఏ గా పోటీ చేసి గెలిచింది.

కరోనా విపత్తు సమయంలో సీతక్క ఆదివాసులకు నిత్యవసరాల సరుకులను అందించి మంచి పేరును సంపాదించుకుంది.రాష్ట్ర మహిళ సమస్యలపై సీతక్క గట్టిగా పోరాటం చెయ్యగలదని హైకమాండ్ భావిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube