కొత్త కండీష‌న్ పెడుతున్న కొండా సురేఖ‌.. అయినా ఆమెవైపే రేవంత్ మొగ్గు..

హుజూరాబాద్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో జ‌రిగిన‌న్ని మ‌లుపులు బ‌హుశా మ‌రెందులో కూడా జ‌ర‌గ‌లేదేమో అనిపిస్తుంది.ఎందుకంటే ఒక ఉప ఎన్నిక అన్నిపార్టీల్లో సంచ‌ల‌నం రేపుతోంది.

 Konda Surekha Is Putting New Condition .. But Rewanth Is Leaning Towards Her ..,-TeluguStop.com

సాధార‌ణంగా ఒక ఉప ఎన్నిక వ‌స్తే అక్క‌డ ప్ర‌ధానంగా ఉండే అభ్య‌ర్తి గురించే ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక విష‌యానికి వ‌స్తే మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అన్ని పార్టీల్లోనూ జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ఇప్ప‌టికే కాంగ్ర‌స్ త‌ర‌ఫున కొండా సురేఖకు టికెట్ ఇచ్చేందుకు అధినేత‌లు రెడీ అవుతున్నారు.

కాగా ఆమెకు నేరుగా ఇవ్వ‌కుండా ఇంట్రెస్ట్ ఉన్న వారు గాంధీ భ‌వ‌న్‌లో అప్లై చేసుకోవాల‌ని సూచించారు.

కానీ ఇందులో సురేఖ మాత్రం అప్లై చేసుకోలేదు.కానీ రేవంత్ మాత్రం పోటీ చేసే వారి లిస్టులో ఢిల్లీకి బ‌య‌లు దేరి వెళ్లారు.

అయితే ఆయ‌న మాత్రం ఇన్ని పేర్లు ఉన్నా కూడా కొండా సురేఖకే అవ‌కాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.కానీ దీనిపై సురేఖ మాత్రం పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేద‌ని ఇప్ప‌టికే అర్థం అవుతోంది.

ఇక ఆమె పోటీ చేయాలంటే మాత్రం నానా ర‌కాల కండీష‌న్లు పెడుడుతున్నారు.ఇక ఇప్పుడు కూడా మ‌రో కండీష‌న్ పెడుతోంది ఆమె.

Telugu Congress, Huzurabad, Konda Surekha, Ts Poltics, Trs, Ts Congress, Waranga

తాను ఒక వేళ హుజురాబాద్లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసినా మళ్లీ తిరిగ త‌న సొంత జిల్లా అయిన వరంగల్ కే వస్తానని చెబుతోంది.దీనికి ఒప్పుకుంటేనే హుజురాబాద్‌లో పోటీచేసేందుకు రెడీ అంటూ సంకేతాలు ఇస్తోంది.అయితే ఇన్ని కండీష‌న్లు పెడుతున్నా కూడా ఆమె వైపే రేవంత్ మొగ్గు చూపుతున్నారు.

ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కూడా బీసీలనే అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించాయి.కాబ‌ట్టి తాము కూడా బీసీ వర్గానికే చెందిన కొండా సురేఖను దింపితే ఆమె పద్మశాలీ కాబ‌ట్టి ఆ వ‌ర్గం ప్ర‌జ‌లు అలాగే ఆమె భర్త కొండా మురళి మున్నూరుకాపు కాబ‌ట్టి ఆ వర్గం ప్ర‌జ‌లు కూడా త‌మ‌కు క‌లిసి వ‌స్తార‌ని కాంగ్రెస్ ప్లాన్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube