కొత్త పార్టీ అవసరమని కొండా కొత్త పలుకులు... అసలు వ్యూహం ఇదే

తెలంగాణలో రాజకీయ పరిస్థితి రణరంగాన్ని తలపిస్తోంది.అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యూహ, ప్రతి వ్యూహాలు, మాటల తూటాలతో రాజకీయం రంజుగా మారిందని చెప్పవచ్చు.

 Konda New Words That A New Party Is Needed This Is The Real Strategy, Telangana-TeluguStop.com

అయితే తెలంగాణలో ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణలో బలంగా ఉన్నాయి.అయితే ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి.

త్వరలో షర్మిల తన పార్టీని ప్రారంభిస్తున్నానని తెలిపిన సందర్భంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.షర్మిల తెలంగాణ వ్యతిరేకి అని, షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని కొండా వ్యాఖ్యానించారు.

అయితే తెలంగాణ రాజకీయాలపై మరో సారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందని అన్నారు.

రేవంత్ రెడ్డితో కలిసి పార్టీ ఏర్పాటు చేస్తారన్న పుకార్ల నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు 90 శాతం ప్రయత్నిస్తున్నాం.ఇక కొత్త పార్టీ సాధ్యం కాకపోతే బీజేపీలో చేరతానని కొండా క్లారిటీ ఇచ్చారు.

టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి బలమైన వ్యక్తులు, బలమైన పార్టీలు సమూహంగా ఏర్పడాల్సిన అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.మరి కొండా కొత్త పార్టీ పెడతారా లేక బీజేపీలో చేరతారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే ఈ మాటల వెనుక ఉన్నఅసలు వ్యూహం ఏంటని గమనిస్తే కొండారేవంత్ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రానున్నట్టు చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube