బాడీలో 47 బులెట్లు దిగినా అతను బతికింది వారికోసమేనట!

టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషనల్ అవుతుందనే విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన సినిమాల విషయానికి వస్తే ఆయన ఎక్కువగా యాక్షన్ సినిమాలను తీయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Konda Movie Trailer Launch, Konda Movie, Konda Movie Trailer Lunch, Tollywood, R-TeluguStop.com

అయితే రాజకీయ నాయకుల జీవిత కథ ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించారు.తాజాగా కొండ సురేఖ మురళి దంపతుల జీవిత కథ ఆధారంగా వర్మ “కొండా” అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

షూటింగ్ పనులను మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో కొండా మురళి సురేఖతో ప్రేమలో పడటం మావోయిస్టులతో చేతులు కలపడం, రాజకీయాల్లోకి రావడం వంటి సన్నివేశాలను చూపించారు.

ఇక ఈ ట్రైలర్ చివరిలో “వాడిని సంపుడు నా పని కాదు నా బాధ్యత” అంటూ హీరో చేత ఒక డైలాగ్ చెప్పించడం ఈ ట్రైలర్ కి హైలెట్ గా మారింది.అయితే అది ఎవరు ఏంటి అనే విషయం సినిమాలో చూడాల్సి ఉంటుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను సరిగ్గా అదే సమయానికి విడుదల చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే గత 30 సంవత్సరాల క్రితం జనవరి 26వ తేదీ 10:25 కి కొండ మురళి పై హత్య ప్రయత్నం జరగడంతో అదే సమయానికి ఈ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ విడుదల చేసిన అనంతరం కొండా మురళి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన వర్మ పై ప్రశంసలు కురిపిస్తూ గత 30 సంవత్సరాల క్రితం ఇదే జనవరి 26 వ తేదీన నా పై బుల్లెట్ ఫైరింగ్ జరిగింది.47 బుల్లెట్లు నా బాడీలో దిగినా నేను బ్రతికే ఉన్నాను.అది కూడా మా కుటుంబం కోసం కాదు నా ప్రజల కోసం.ఈ సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే చాలా బాగుంటుందని కొండా మురళి ఈ సందర్భంగా తెలియజేశారు.

Konda Movie Trailer Launch, Konda Movie, Konda Movie Trailer Lunch, Tollywood, Ram Gopal Varma, - Telugu Konda, Kondatrailer, Ram Gopal Varma, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube