ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో చిన్నపాటి ఆందోళనలు కొనసాగినా, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మెజారిటీ జనాల నుంచి మద్దతు లభించింది.అన్ని జిల్లాలతో పాటు అమలాపురం లోక్ సభ స్థానం పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని కోనసీమ జిల్లాగా ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ సమయంలో కోనసీమ జిల్లా ను బిఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలంటూ టిడిపి, జనసేన, ఇతర ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో , బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కోనసీమ జిల్లా గానే కొనసాగించాలంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొద్దిరోజులకు నిరసన కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
అది కాస్తా నిన్న ఉద్రిక్తంగా మారి వైసిపి మంత్రి ఎమ్మెల్యే నివాసగృహాల తో పాటు , ప్రైవేటు బస్సుల దహనం వరకు ఆందోళన చేరింది.మొదట్లో అంబేద్కర్ జిల్లాగా కోనసీమ జిల్లాను ప్రకటించాలంటూ డిమాండ్ చేసిన టిడిపి జనసేన పార్టీలు ఈ విషయంలో ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి.
పైగా ఏపీ ప్రభుత్వం దే తప్పు అంటూ విమర్శలు చేస్తున్నాయి.అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే… ఇప్పుడు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా వివాదం పక్క జిల్లాలకు పాకింది.
ప్రస్తుతం అమలాపురంలో 144 సెక్షన్ విధించారు .
నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఎస్సీయేతర కులాలకు చెందిన కొంతమంది నిరసనలకు దిగారు.ప్రభుత్వం ప్రస్తుతం ఆందోళన నెలకొన్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును మార్చుతారు అన్న అనుమానంతో చాలా జిల్లాల్లో అంబేద్కర్ జిల్లా పేరు అనుకూలంగా కొంతమంది ఆందోళనలు నిర్వహిస్తుండగా, కోనసీమ జిల్లా పేరును మాత్రమే కొనసాగించాలని కోరుతూ మరికొంతమంది నిరసనలకు దిగారు . ఈరోజు గుంటూరు కాకినాడ తో పాటు మరికొన్ని జిల్లాల్లో అంబేద్కర్ పేరు మార్చవద్దు అంటూ దళిత సంఘాలు నిరసనకు దిగాయి.