భువనేశ్వర్‌ లో తెరుచుకున్న కోణార్క్‌ సూర్యదేవాలయం..!

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.ఈ మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, థియేటర్లు అన్ని మూతపడిన సంగతి అందరికి తెలిసందే.

 Konark Sun Temple, Opens,  Bhubaneswar-TeluguStop.com

లాక్ డౌన్ సడలింపులతో కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి అనుమతి ఇస్తుంది.తాజాగా కోణార్క్‌లోని సూర్య దేవాలయం మంగళవారం తెరుచుకుంది.అన్ లాక్ 4.0లో గైడెన్స్ ప్రకారం కరోనా నియమాలను పాటిస్తూ ఆలయం తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.అయితే ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో మార్చి 15న ఆలయాన్ని మూసివేశారు.

అయితే ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఎస్‌ఓపీల ప్రకారం.

రోజుకు కేవలం 2,500 మంది పర్యాటకులను మాత్రమే రెండు స్లాట్లలో పంపించడానికి కేంద్రం అనుమతి తెలిపింది.ఇక ఉదయం 1200 మందిని, మధ్యాహ్నం 1,300 మంది పర్యాటకులకు మాత్రమే ఆలయాన్ని తిలకించేందుకు అనుమతి ఇస్తున్నారు.

ఇక లాక్ డౌన్ కంటే ముందు ఒక్కరోజే 5వేల మంది పర్యాటకులను ఆలయాన్ని సందర్శించేవారని వారు వెల్లడించారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుకు 2,500 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు భువనేశ్వర్‌ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ పురావస్తు శాస్త్రవేత్త అరుణ్‌ మాలిక్ తెలిపారు.

అంతేకాదు పర్యాటకులంతా తప్పని సరిగా మాస్కులు ధరించి, సామజిక దూరం పాటించాలని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube