పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి పవన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
బాలీవుడ్లో సూపర్ సక్సెస్ చిత్రంగా నిలిచిన ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాతో చాలా గ్యాప్ తరువాత పవన్ వెండితెరపై కనిపించనుండటంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
కాగా పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ కాకముందే, పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు.
ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమాకు పవన్ ఓకే చెప్పాడు.ఈ సినిమాలతో పాటు దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించనున్న సినిమాకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కాగా తాజాగా ఓ స్టార్ రైటర్ పవన్‌కు ఓ కథను వినిపించేందుకు ఆసక్తి చూపుతున్నాడట.స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ పవన్‌ను దృష్టిలో పెట్టుకుని ఓ కథను రాసినట్లు, దాన్ని పవన్‌కు వినిపించాలని ప్రయత్నిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ కథలో పవన్ లెక్చరర్ పాత్రలో నటించే అవకాశం ఉందని, ఈ సినిమాను నిర్మాత బండ్ల గణేష్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
గతంలో పవన్ కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ మూవీని నిర్మించిన బండ్ల గణేష్, పవన్‌తో మరో సినిమా చేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబో సెట్ కాలేదు.ఎట్టకేలకు పవన్ బండ్లకు ఓకే చెప్పడంతో ఆయన ఇప్పుడు పవన్ కోసం కథలను వెతికే పనిలో ఉన్నాడు.
ఈ క్రమంలోనే కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో కోన వెంకట్ ఓ కథను రాశాడని, ఇందులో పవన్ లెక్చరర్‌గా అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.మరి పవన్ ఈ కథకు ఓకే అంటాడా లేడా అనేది చూడాలి.
వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.